అదృష్టం అంటే… అజయ్ దే …

ఉపాధికోసం దుబాయ్ వెళ్ళిన తుంగుర్ యువకుడు

ఎమిరేట్స్ డ్రాలో 30 కోట్లుకు పైనే గెలుపు!

J. Surender Kumar

అదృష్టం అంటే అజయ్ ది. అది ఆషామాషి అదృష్టం కాదు,. అదృష్ట దేవత అతడిని ఆకాశం అంచుల వరకు. ఎత్తింది, ఆగర్భ శ్రీమంతుడిగా గుర్తింపునించింది. ప్రచారం మాధ్యమాలలో అతడి పేరుతోపాటు ఈ ప్రాంతం పేరు మారుమోగుతుంది.”,

వివరాలు ఇలా ఉన్నాయి!
ఉన్న ఊరిలో ఉపాధి లేక దుబాయ్ వెళ్ళిన ఆ యువకుడిని అదృష్టం వరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రాత్రికి రాత్రి ₹ 30 కోట్లకు యజమానిని చేసింది. బీర్పూర్ మండలం తుంగుర్ కు చెందిన ఓగుల దేవరాజం- ప్రమీల ల కుమారుడు అజయ్ బతుకుదెరువు కోసం ఇటీవల దుబాయ్ కి వలస వెళ్ళాడు. అక్కడ డ్రైవర్ గా విధుల్లో చేరాడు. దుబాయ్ లో అక్కడి 15 ధీరమ్స్ డబ్బులతో ఎమిరేట్స్ డ్రాలో పెట్టుబడి పెట్టి నంబర్ తీసుకున్నాడు. డ్రాలో అదృష్టం తననే వరించిందన్న విషయం తెలుసుకున్న అజయ్ స్వగ్రామంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అజయ్ కి 30 కోట్లు డ్రా గెలుచుకోవడం పట్ల అతని బంధువులు, మిత్రులు, గ్రామస్థులు సంతోషం వెలిబుచ్చారు. అజయ్ కి తమ్ముడు చెల్లె ఉన్నారు. గత కొన్ని నెలలు ఒంగోలు గ్రామంలో చిన్న ఇంటి నిర్మాణం చేశారు ఆ ఇంటికి ఇంకా సిమెంటు పొరలు, పూతలు కాలేదు, గతంలో ధర్మపురిలో అజయ్ కుటుంబం టి కొట్టును ఇక్కడ ఉపాధి కరువై తుంగురు గ్రామానికి. జీవనోపాధి కోసం వెళ్లారు..