కదలని స్వామివారి కళ్యాణ రథం !
ధర్మపురి ఆలయ తీరు తెన్నులు !
(J. Surender Kumar)
వివరాలు ఇలా ఉన్నాయి!

ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఉగ్ర నరసింహ స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ యమధర్మరాజు ఆలయం, అభయాంజనేయ స్వామి ఆలయం, తోపాటు శేషప్ప కళావేదిక పై నిత్యం స్వామి వారికి కళ్యాణం

నిర్వహిస్తుంటారు. ( భక్తజనం శాశ్వత కళ్యాణానికి కళ్యాణానికి వేలాది రూపాయలు ముందస్తు చెల్లించి వారి పుట్టినరోజులు,కళ్యాణరోజులలో స్వామివారి నిత్య కళ్యాణం జరిపించుకుంటారు) స్వామి వారి నిత్య కళ్యాణం పూజా టిక్కెట్ల ద్వారా ఆలయానికి సాలినా లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నది.

రెండు రాజగోపురాలు, అనుబంధం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో, శ్రీ మహాగణపతి ఆలయం ఉంది. నిత్యం ఈ ఆలయాలకు, పచ్చనిమామిడి ఆకుల తోరణాలు అగుపించిన సందర్భాలు లేవు. శ్రీ యోగా నరసింహ (పాత) ఆలయంలోని స్వామివారి గర్భాలయం ముందు ద్వారానికి, మాత్రమే, నిత్యం పచ్చని మామిడి తోరణాలు ఆగుపిస్తాయి.

ప్రస్తుతం నెల రోజులపాటు ధనుర్మాసం సందర్భంగా ఉదయం 3 గంటల నుండి 6 గంటల్లోపే. స్వామివార్లకు అభిషేకం, పూజాది కార్యక్రమాలు జరుగుతాయి..

పండుగలు, ప్రత్యేక రోజులలో ,ప్రముఖులు రాక సందర్భంలో మాత్రమే ఆలయ ద్వారాలకు మామిడి తోరణాలు, పూల దండలు అగుపిస్తాయి.
కదలని స్వామివారి కళ్యాణ రథం!

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం, క్షేత్ర మహత్యం, ప్రచార నిమిత్తం ఓ భక్తుడు లక్షల లాధి రూపాయల విలువ గల ఐచర్ వాహనమును కొనుగోలు చేసే ఆలయానికి అందించారు. అట్టి వాహనంకు లక్షలాది రూపాయలను, ఆలయ నిధుల నుండి ఖర్చు చేసి. నమూనా ఆలయమును ఏపీలోని కాకినాడ పట్టణంలో ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.

జగిత్యాల వాహనాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2017 మే మాసంలో, T.S.21 T.0445 నంబర్ తో ఆలయం పేరిట రిజిస్టర్ అయ్యింది. మూడుసార్లు అట్టి స్వామి వారి కళ్యాణం రథం కదిలింది. మొదటిసారి జగిత్యాల కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమానికి, ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం హైదరాబాద్ కు, మొన్నటి దసరా ఉత్సవాల్లో జమ్మి గద్దె వరకు మాత్రమే రథం కదిలింది.

మైకుల్లో వినిపించని నరసింహ స్తోత్రం!
యాత్రికులకు, భక్తజనంకు, క్షేత్ర వాసులకు శ్రవణానందంకై నరసింహ స్తోత్రం, పూజలో వేళలు, ఉత్సవాలు, స్వామి వారి కళ్యాణం, అభిషేకం, విశేషాలు ఆలయ కార్యక్రమం కోసం గోదావరి నది తీరం, ఆంజనేయ స్వామి విగ్రహం, బస్టాండ్, తదితర ప్రాంతాలలో మైక్ లు ఏర్పాటు చేసి కార్యక్రమాల ప్రకటనలకు. ఆలయంకు అనుసంధానం చేశారు. ప్రస్తుతం అవి మూగ వ్రతం పట్టాయి, ఎప్పుడు పని చేస్తాయో ? ఎప్పుడు వినిపిస్తాయో ? ఆ నరసింహుడికే తెలియాలి.
పారిశుద్ధ్యంలో ప్రశంస పత్రం! … ప్రత్యక్షంగా చూస్తే ?

గత సంవత్సరం అంతర్జాతీయ సంస్థ I.S.O.9001 -2015 (క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టం ) వారు ఆలయ పారిశుద్ధ్య నిర్వహణ, ధార్మిక కార్యక్రమాల, భక్తులకు కల్పించిన సౌకర్యాలు, మంచినీటి వసతి, గదుల్లో నిర్వహణ, కార్యాలయ నిర్వహణ తదితర అంశాలపై ఆడిటింగ్ నిర్వహించి, అభినందిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.

విశాలమైన ఆలయ ప్రాంగణం గరుగు రాతి తో ఫ్లోరింగ్ చేయబడి ఉంది. గత కొంతకాలంగా. వాటర్ పైపుల ద్వారా కెమికల్స్ వేసి కడిగిన సందర్భం లేదనే ఆరోపణలు. ఉన్నాయి. ప్రత్యేకంగా వేణుగోపాల స్వామి ఆలయం ముందు, కొత్త నరసింహ స్వామి హోమశాల దారిలో, శేషప్ప కళావేదిక ముందు నుంచి పూజా సామాగ్రి దుకాణం వరకు, మసకబారిన ప్రాంగణం అగపిస్తుంది..

ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారులు జోక్యం చేసుకోని ఆలయ ప్రాంగణం నిత్యం కెమికల్స్ ద్వారా శుభ్రపరిచేలా, ఆలయాల ద్వారాలకు, రాజగోపురాలకు నిత్యం మామిడి తోరణాలు కట్టించడంతోపాటు, మైకులలో సుప్రభాతం ప్రసారమయ్యేలా చర్యలు చేపట్టాలని భక్తజనం కోరుతున్నారు.