కొబ్బరి ముక్కల సేకరణ, పూజా సామాగ్రి అమ్మకాలు!
ధర్మపురి ఆలయ పరిధిలో..
(J. Surender Kumar)
సాలిన కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిధిలో కొబ్బరి ముక్కల సేకరణకు, పూజ సామాగ్రి అమ్మకాల కోసం వేలం ప్రకటన జారీలో జాప్యం ఎందుకో అంతుపట్టడం లేదనే చర్చ జరుగుతోంది.
గతంలో వీటిని వేలంలో సొంతం చేసుకున్న వ్యాపారులు, తమకు covid-19 లాక్ డౌన్ వల్ల వ్యాపారాలు నిర్వహించలేక నష్టపోయాం అంటూ దాదాపు 31 మంది హైకోర్టును ఆశ్రయించారు.. మా వ్యాపారాలు, లీజ్ కాల పరిమితి ముగిసిన తాము నిర్వహించే వ్యాపారాలకు వేలం ప్రకటన జారీ చేయవద్దని సారాంశం.

కోవిడ్ పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం లీజు దారులకు మినహాయింపు ఇచ్చింది. covid-19 , లాక్ డౌన్ నేపథ్యం.తో పాటు, ఆలయాలు మూసివేత, భక్తులను దర్శనాలకు అనుమతించకపోవడం, తదితర అంశాల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ వల్ల 292 రోజులు ఆలయాలు మూసి ఉంచినట్టు ప్రభుత్వం గుర్తించింది.
లీజు కాల పరిమితి ముగిసిన.రోజు నుంచి 292 రోజులపాటు ఆలయానికి ఎలాంటి కిరాయి డబ్బులు చెల్లించకుండా లీజ దారులకు , ఆయా ఆలయాల కార్యనిర్వాహణాధికారులకు ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు
ఈ నేపథ్యంలో ధర్మపురి ఆలయంలో కొబ్బరి ముక్కల సేకరణ లీజు కాలపరిమితి. 1/4/2020 నుంచి. 31/3/ 2022 నాటికి ముగిసింది. ఈ కాల పరిమితికి లీజు దారుడు ₹ 17.50 లక్షలు ఆలయానికి చెల్లించాలి.

కోవిడ్ కారణంగా అదనంగా. 292 రోజులు పాటు ఎలాంటి రుసుము చెల్లించకుండా కొబ్బరి ముక్కల సేకరణకు. అనుమతించారు. ఇదే తరహాలో ఆలయ ప్రాంగణంలో పూజా సామాగ్రి విక్రయించే కిరాయిదారుడు తేది.16/12/2019 నుంచి. 31/3/2022 వరకు ఆలయానికి ₹.13.84 లక్షలు. కిరాయి చెల్లించాలి. Covid -19 నేపథ్యంలో ఈ వ్యాపారికి సైతం 292 రోజులు మినహాయింపు లభించింది.

దాదాపు 45 రోజుల కాల పరిమితి మాత్రమే మిగిలి ఉంది. కమిషనర్ ఆదేశాల మేరకు మూడు నెలలు ముందుగానే. వేలం ప్రకటన జారీ చేసి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
పూజా సామాగ్రి దుకాణంకు వేలం నిర్వహిస్తారా?
ఇది ఇలా ఉండగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలోని ఆలయ ప్రాంగణంలో పూజా సామాగ్రి అమ్మకాలు కొనసాగించే దుకాణం ఉన్న ఏకైక దేవాలయం ధర్మపురి ఒక్కటే. డిసెంబర్ మాసంలో కోట్లాది రూపాయల నిధులతో ఆలయ ప్రాంగణం, మండపాల పనులను ఆలయ అధికారులు ప్రారంభించనున్నారు. ఈ దశలో పూజా సామాగ్రి దుకాణం వేల నిర్వహించితే, ఆలయంలోఅభివృద్ధి పనుల్లో భాగంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ దుకాణం కొంతకాలం పాటు మూసి వేయక తప్పదు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా మూసివేసిన కాలానికి కిరాయ మినహాయింపు ఇవ్వాలంటూ భవిష్యత్తులో ఈ దుకాణంను వేలంలో సొంతం చేసుకున్న వారు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ నెలకొంది.. ఆలయ ఉన్నతాధికారుల ,ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల అభిప్రాయాల మేరకు ఈ దుకాణం కు వేలం ప్రకటన జారీ చేస్తారో ? రద్దు చేస్తారో ? అని భక్తజనం వేచి చూస్తున్నా రు.