అంజన్న సొమ్ము అందినంత మింగు! కోవిడ్ లో కొండగట్టు ఆలయం మూసివేత !

నిర్వహణ పేరిట లక్షలాది ఖర్చుల మోత !
రికార్డులలో బిల్లులు! ఆదాయానికి చిల్లులు !
అడిగేది ఎవరు ..? అడ్డుకునేది ఎవరు ?

(J. Surender Kumar)

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆదాయంను కొందరు అవినీతి అధికారులు, ఉద్యోగులు అందినంత మింగుతు, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల చర్చ నెలకొంది. . కోవిడ్ నేపథ్యంలో కొన్ని నెలలపాటు కొండగట్టు ఆలయంను ప్రభుత్వం మూసివేసింది. కోవిడ్ సమయంలో ఆలయం నిర్వహణ పేరిట లక్షలాది రూపాయల ఖర్చుల బిల్లులు, రికార్డు బుక్కులలో నమోదు చేశారు. రికార్డు బుక్కులో నమోదైన ఖర్చులే వారి అవినీతి అక్రమాల ఆరోపణల చర్చకు అక్షర సత్యంగా అగుపిస్తుంది.

వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామికి సాలీనా లక్షలాదిమంది భక్తులు తాకిడితోపాటు, కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. .భక్తుల సౌకర్యార్థం ఉద్యోగుల జీతభత్యాల, నిర్వహణ తదితర అంశాల కోసం. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు.

కోవిడ్ నేపథ్యంలో 292 రోజులు ఆలయం మూసివేత !

కోవిడ్ – నేపథ్యంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టప్రకారం. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలకు. భక్తజనం ప్రవేశాలను నిషేధించారు. 292 రోజులపాటు నిరవధికంగా రాష్ట్రంలో అనేక ప్రముఖ ఆలయాలను మూసివేశారు. .అర్చక స్వాములు నిత్యం స్వామివారికి  పూజలు నిర్వహించడం  తిరిగి. మూసి వేయడం వరకే  మినహాయింపు ఇచ్చారు.
2020 ఆర్థిక సంవత్సరంలో …(202 రోజులపాటు)
20 20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం  21-3-2020 నుంచి 8-6-2020 వరకు 9-6-2020 నుంచి 10-10-20 కొరకు లాక్ డౌన్ తో పాటు కొండగట్టు ఆలయం కూడా మూసి వేయబడింది.  మొత్తం 202 ( రెండు వందల రెండు రోజులు).
2021 ఆర్థిక సంవత్సరంలో…(90 రోజులపాటు)
1-4-2021 నుంచి 30-6-2021 వరకు 90 (తొంబై రోజులపాటు) మూసివేశారు.

మొత్తానికి కొండగట్టు ఆలయం 292 రోజులపాటు ఆలయాలలోకి భక్తులను అనుమతించనట్లు ప్రభుత్వ, దేవాదాయ శాఖ రికార్డులలో నమోదయి ఉంది..

ఆదాయం తగ్గింది -అదనంగా ₹ 68  లక్షల ఖర్చు పెరిగింది !

2020 ఏప్రిల్ నుంచి మార్చి 2021 వరకు వివిధ మార్గాల( సాధారణ నిధులు , అన్నదానం)  ద్వారా వచ్చిన ఆదాయం ₹ 11,48,65,116-00/- కాగా
ఈ కాలానికి ఉద్యోగుల జీతాలు, అడ్వాన్సులు తో పాటు నిర్వహణ ఖర్చులు తదితర ₹ 12,16,36,594-00/- ఖర్చు అయినట్టు రికార్డులో నమోదయింది. కొండగట్టు స్వామివారి ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం కంటే అదనంగా ₹,68,32,900-00/- ఖర్చు జరిగినట్టు పుస్తకాలలో పేర్కొనబడింది .