ఏపీలో 26 మంది కి ఈడీ నోటీసులు జారీ!

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో
₹ 234 కోట్లు.కుంభకోణం..

(J.Surender Kumar)

చంద్రబాబు (టీడీపీ ) ప్రభుత్వ హయాంలో జరిగిన ₹.234 కోట్ల ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం 26 మందికి నోటీసులు జారీ చేసింది. 
హైదరాబాద్‌లో సోమవారం  విచారణకు హాజరు కావాలని ఫెడరల్ ఏజెన్సీ వారిని కోరింది. 

ఈ కుంభకోణంపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది  షెల్ కంపెనీలను ఉపయోగించి నిధుల మళ్లింపును గుర్తించింది.  నోటీసులు అందుకున్న వారిలో అప్పటి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఘంటా సుబ్బారావు, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ & సీఈవో, ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌ కె లక్ష్మీనారాయణ , ఓఎస్‌డీ ఉన్నారు. 
2014లో టీడీపీ హయాం లో. APSSDC హై-ఎండ్ టెక్నాలజీ శిక్షణను అందించడం కోసం,  SIEMENSతో మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (MOA) కుదుర్చుకుంది.  సంస్థ నిరుద్యోగ యువత కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో శిక్షణా కార్యక్రమాలను అందించింది  ఏపీఎస్‌ఎస్‌డీసీ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఘంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ కె. లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు కొన్ని ప్రైవేట్‌ సంస్థల నిబంధనలను తుంగలో తొక్కారని, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సీఐడీ దర్యాప్తు నివేదికలో ఆరోపించింది.