నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ హనుమంతు !
(J.Surender Kumar)
మూడు రాజధానుల బిల్లును తిరిగి ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాజకీయేతర జేఏసీ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ జేఏసీపక్షాన ఆదివారం ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
అమరావతితో పోల్చితే విశాఖపట్నంలో వాయు, సముద్ర, రోడ్డు కనెక్టివిటీలు అత్యుత్తమంగా ఉన్నాయని హనుమంతు లజపతిరాయ్ పేర్కొన్నారు
డా. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్-ఛాన్సలర్ మరియు మూడు రాజధానులపై రాజకీయేతర జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ హనుమంతు లజపతిరాయ్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సెషన్‌లో మూడు రాజధానుల బిల్లును రూపొందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని గా, అమరావతి శాసన రాజధానిగా,. కర్నూల్ న్యాయ. రాజధానిగా న్యాయపరమైన అడ్డంకులను త్వరగా అధిగమించి రాష్ట్రం అన్ని రంగాల్లో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.