అన్ని ప్రభుత్వ శాఖలు IDOC కీ షిఫ్ట్ కావాలి
జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశం !
(J. SURENDER KUMAR)
ఇక నుంచి నూతన IDOC.( ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ ) నుంచి అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాల కార్యకలాపాలు ప్రారంభించాలని సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమం నూతన భవనంలో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ గుగులోతు రవి ఆ శాఖల ఉన్నతాధికారులకు వివరించారు.
శుక్రవారం IDOC కాన్ఫరెన్స్ హల్ లో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్లు మంద మకరంద, బిఎస్ లత, లతో కలిసి సమావేశమయ్యారు.

అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే వేదికగా ప్రజలకు సులభంగా, వేగంగా సేవలు అందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో IDOC లను నిర్మించినందున ప్రభుత్వ శాఖలు తమకు IDOC లో కేటాయించిన గదులకు పాత కార్యాలయాల నుండి సామగ్రి , దస్త్రాలను వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు.
అధునాతన హంగులు, సౌకర్యాలతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ను ఎప్పుడూ క్లీన్ గా ఉండేలా అధికారులు సహకరించాలని అన్నారు. టి – ఫైబర్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
స్టోర్ రూం ల కోసం అదనంగా గదులు కావాలనుకుంటే ఐ డి ఓ సి బయట ఉన్న ప్రభుత్వ భవనాలలో గదులను కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
వచ్చే ప్రజావాణి కార్యక్రమం ను కూడ నూతన IDOC లోనే నిర్వహిస్తామని అధికారులకు స్పష్టం చేశారు.