భారత్ జోడో యాత్రను కు బ్రేక్ ?

కేంద్రం మంత్రి  రాహుల్‌కు లేఖ !

(J.Surender Kumar)

భారత్ జోడో యాత్రలో COVID-19 మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరియు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లకు లేఖ రాశారు.

“రాజస్థాన్‌లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో ఖచ్చితంగా COVID మార్గదర్శకాలను అనుసరించండి. మాస్క్‌లు-శానిటైజర్ వాడకం అమలు చేయాలి. టీకాలు వేసిన వ్యక్తులు మాత్రమే పాల్గొనాలి” అని ఆరోగ్య మంత్రి మంగళవారం రాసిన లేఖలో తెలిపారు.
ఈ నిబంధనలు అమలు చేయడం  సాధ్యం కాకపోతే పాదయాత్రను వాయిదా వేయాలని మాండవ్య అభ్యర్థించారు.
“కొవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించడం సాధ్యం కాకపోతే, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను వాయిదా వేయండి”. అని లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రి రాసిన లేఖపై ఆ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ, “గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ కోవిడ్ నిబంధనలను పాటించారా ? అని బీజేపీని అడగాలను కుంటున్నాను అని ఆరోపించారు.