బీజేపీతో ఉంటే ఓ నితీ లేకుంటే అవినీతా..?

ఎమ్మెల్సీ కవిత పులిబిడ్డ !

ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

(J. Surender Kumar)

ధర్మం గురించి మాట్లాడే బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం ఆలయాలకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని, సీఎం కేసిఆర్, ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్, చేసిన వ్యాఖ్యలు అసంబద్దమని, ఎమ్మెల్సీ కవిత పులిబిడ్డ అని, కరీంనగర్ – జగిత్యాల రహదారిపై ఎందుకు మాట్లాడటం లేదని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు, జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసిఆర్, ఎమ్మెల్సీ కవితలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

జగిత్యాలలో బిజెపి ప్రజా సంగ్రామ యాత్ర సభ ప్రజలకు వెలవెల బోయిందని, జగిత్యాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు తెచ్చారో ఎందుకు చెప్పలేదన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశారన్నారు. గత ప్రభుత్వాలు బతుకమ్మ పండుగను పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో బతుకమ్మ ఘాటలను నిర్మించి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. నిత్యం వ్యక్తిగత ఆరోపణలు చేయడం తప్పా అభివృద్ధి గురించి మాట్లాడటం బిజెపి నాయకులకు తెలియదన్నారు. ఎమ్మెల్సీ కవిత పులి బిడ్డనే అని, సిబిఐ అధికారులు 7 గంటల పాటు విచారణ చేసిన సహకరించారన్నారు. టిడిపికి చెందిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనాచౌదరి పై
కేసులు పెట్టిన తర్వాత వారు బిజెపిలో చేరితే కేసుల గురించి పట్టించుకోవడం లేదని, బిజెపితో ఉంటే ఓ నీతి లేకుంటే అవినీతా అని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏనిమిదేళ్లు అవుతున్న కరీంనగర్ జగిత్యాల రహదారి
అభివృద్ధికి ఎందుకు నిధులు తీసుకరావడం లేదో సమాధానం చెప్పాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసిఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, పట్టణ బిఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, మండల పార్టీ అధ్యక్షులు రమేష్,బాల ముకుందం,
యూత్ అధ్యక్షుడు కత్రోజు గిరి, తదితరులు పాల్గొన్నారు.