బీఆర్ఎస్ పార్టీ ముహూర్తం ముందే చెప్పిన *ఉప్పు *

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్  బిజీ బిజీ !

(J. SURENDER KUMAR)

సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ )పార్టీ కార్యాలయాన్ని రాజధాని ఢిల్లీ నగరంలో ఈనెల 14న ప్రారంభించనున్నట్టు శుక్రవారం స్పష్టం చేశారు.
పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం డిసెంబర్ మాసంలో జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితుడు గొల్లపల్లి సంతోష్ శర్మ వివరించిన అంశం * ఉప్పు* లో అక్టోబర్ 22న ప్రచురించింది.
ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్ లోని భారత్ రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయం ప్రారంభం. బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గం ఏర్పాటు. జాతీయ కార్యదర్శుల నియామకం చేయనున్నట్టు ఆయన హైదరాబాదులో భీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ  కార్యక్రమంలో తెలిపారు. ఢిల్లీలో ఓఅనేకమంది రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధులతో కూడా కేసీఆర్ భేటీ కానున్నట్టు వివరించారు.

22 అక్టోబర్ 2022న ముందస్తు వార్తా కథ


ముందస్తుగా అక్టోబర్ 22న ప్రచురితమైన వార్త కథనం

డిసెంబర్లో పార్టీ కార్యాలయం ప్రారంభం.?.

జ్యోతిష్య పండితుడు గొల్లపల్లి సంతోష్ శర్మ

స్వయంగా జ్యోతిశ్శాస్త్రం మీద మంచి అవగాహనా, నమ్మకం ఉన్న కేసీఆర్ పార్టీ ప్రకటన కానీ, రిజిస్ట్రేషన్ కానీ, ఇప్పుడు చేసినప్పటికీ, పార్టీ ఆఫీస్ ప్రారంభం చేయటం మాత్రం శుక్ర మౌఢ్యమి అయ్యాక డిసెంబర్‌లో చేయనున్నారు కావచ్చు
ప్రస్తుతం కేసీఆర్ కు నాలుగవ ఇంటిలో కేతు గోచారం, ఏడవ ఇంట శని గోచారం, అనుకూలంగా లేకపోవడం వలన అంతర్గతంగా, బహిర్గతంగా కొంత వ్యతిరేకత ఏర్పడ్డప్పటికీ, గురు గోచారం అనుకూలంగా ఉండటం అలాగే పదవ ఇంటిలో రాహు గోచారం, సాహసోపేతమైన నిర్ణయాలు, చర్యలు తీసుకునేలా చేయడం వలన, వ్యతిరేకత ఉన్నప్పటికీ, అది ఆయన నిర్ణయాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు.అయితే ఏప్రిల్ 2023 మరియు అక్టోబర్ 2023 మధ్యన గురువు, శని ,మరియు కేతు గోచారం పూర్తిగా అనుకూలంగా లేకపోవడం, ఆగస్ట్ నుంచి రాహు మహర్దశలో, కుజ అంతర్దశ , ప్రారంభం అవ్వటం వలన చేపట్టిన పనులు పూర్తిచేయడానికి ఎక్కువగా శ్రమించాల్సి రావచ్చు. ఆక్టోబరు చివర్లో రాహు, కేతువుల గోచారం మారటం వలన మళ్లీ కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే 2024 మే మాసంలో, గురు గోచారం తిరిగి అనుకూలంగా మారటం, సెప్టెంబర్ నుంచి యోగకారక గురు మహాదశ ప్రారంభం అవటం వలన ,అది వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అనుకూల ఫలితం సాధించటానికి సాయపడుతుంది. అనే కథనం
ప్రచురించింది. 

బీ ఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం

తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా BRS జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఅర్.,
TRS నుండి BRS పార్టీ గా మారిన తొలుతగా కర్ణాటక రాష్ట్రంలో పోటీకి సిద్ధమైన BRS పార్టీ..
తెలంగాణకు సరిహద్దు లో ఉన్న కర్ణాటకలో 7 జిల్లాల్లో తమ BRS పార్టీ అభ్యర్ధుల ను బరిలో నిలపనున్నట్లు సమాచారం.

,కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామి, నటుడు ప్రకాష్ రాజ్ ల సహాయంతో కన్నడనాట సీఎం కేసీఅర్ రాజకీయాలు నడపనున్నరనీ సమాచారం.,