ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి !
(J.Surender Kumar)
ఎటువంటి అనుమతులు, ఆధారాలు లేకుండా
సెర్చ్ వారెంట్ లేకుండా కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యాలయం పై దాడి చెయ్య దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉంటూ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జగిత్యాలలో ఆయన తన ఇంటిలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
ఆయన మాటల్లో..
అభ్యంతకరమైన పోస్ట్ ఏంటిది .,అధికార ప్రతినిధి పార్టీ అలోచనల పై భిన్నాభిప్రాయం ఉంటే..
వాస్తవాలకు భిన్నంగా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా కార్యాలయం పై దాడి చేయడం ఏమిటి అని ప్రశ్నించారు.
కేంద్రం లో బీజేపీ ఈడీ దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తుంటే.. రాష్ట్రంలో మీరు చేస్తున్నది ఎంటి..ప్రత్యర్థుల భావాలను అణచి పోలీసులను ప్రైవేట్ ఆర్మీ సైన్యం లా వాడుకుంటున్నారు..
ఆనాడు కెసిఆర్ ఏమన్నాడు..
కొడుకైనా..కూతురైన అవినీతి ఆరోపణలు వస్తే సలాకల ఎనుక నిలబెడుతా అన్నవా లేదా.,ఇప్పుడు సీబీఐ రాంగానే కవిత ప్రగతి భవన్ కు పరుగుపెడుతోంది.ఇందుకేనా ప్రగతి భవన్ ఉన్నది .
ఆరేళ్ళ బీజేపీ తో అంటకాగి..కాళేశ్వరం కు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదు..
రాజకీయ అధికార కాంక్ష తోనే బీ ఆర్ ఎస్ ఏర్పాటు..
కెసిఆర్ ఉద్యమనేత గా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఈ మేరకు నెరవేర్చారో గుండెల పై చేయి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి..
112 మంది ఎమ్మెల్యే కు ఉన్నా ఎం చేస్తున్నారు..
తెలంగాణ హక్కుల సాధన కోసం ఆకాంక్ష ల కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయ్..
తెలంగాణ ప్రజాస్వామ్యయుతంగా పాలన ఉంటుందని రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాం.
కేవలం రాజకీయ అధికార ఆకాంక్ష కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు., మొన్నటి వరకు బీజేపీకి మిత్ర పక్షంగా ఉంది.
ఉన్న ఊరును ఎలుగ బెట్టనొడు…. దేశాన్ని ఏలుగ బెడుతా అన్నాడట..
కేంద్రం వివక్షకు గురి చేస్తున్నది.. నిధులు కేటియిస్థలేదు..మా హక్కులు కాలరస్తోంది. అనడం మీ అసమర్ధత కాదా…
తెలంగాణ హక్కులు కాపాడ లేనొడివి..
ఆరేళ్ళ పాటు బీజేపీ తో మిత్ర పక్షంగా ఉండి కూడా కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేలా కృషి చేయలేదు..ఇది మీ వైఫల్యం కాదా ..
మిషన్ భగీరథ ను ప్రధాని తో ప్రారంభించారు.
కేంద్రం నుండి నిధులు పొందటంలో ఎందుకు చొరవ చూపలేదు..
కెసిఆర్ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి
అంచనాలు తారుమారు చేస్తూ..కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటకు రాకుండా..ఏమి వద్దు.. మీ ప్రేమ చాలు అని ఓం మోడీ తో అనలేదా.. .
కెసిఆర్ ఉద్యమ నేత.. ?
భద్రాచలం లోని ఏడు మండలాలు ఏకపక్షంగా కలిపితే ఎం చేసినవ్..ఇందుకేనా తెలంగాణ సాధించుకున్నది .
నిజమైన రైతు ప్రభుత్వం యుపిఎ ప్రభుత్వం..ఒక్క కాలంలో 70వేల కోట్లు మాఫీ చేస్తే నేడు ఎన్ డీ ఏ రు.10 లక్షల కోట్లు ఎన్ పే ఏ రద్దు చేసింది ..
4ఏళ్లు గడుస్తుంది. రుణ మాఫీ చేయలేదు..
రైతు బంధు పేరిట ఉమ్మడి రాష్ట్రంలోని రాయితీలు అన్ని రద్దు చేశారు.
రాష్ట్ర హక్కులను ఘనంగా పెట్టి నీ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టవ్..
సాప్ట్ వేర్ ఉద్యోగాల్లో తెలంగాణ వాటా ఎంత కేటీఆర్ సమాధానం చెప్పాలి.
సాప్ట్ వేర్ రంగంలో తెలంగాణ వాటా ను చూడాలంటే భూతద్దం పెట్టి చూడాలి.
ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది.
తెలంగాణలో గరిబోల్లు బతుకొద్దా..
తెలంగాణ కోసం ఎముకలు కోరికే చలిలో జంతర్ మంతర్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ దర్నా చేశారు.
తెలంగాణ హక్కుల సాధన కోసం జంతర్ మంతర్ వద్ద 112 మంది ఎమ్మెల్యేలతో ధర్నా చేస్తే మేము కూడా వస్తం .
కుటుంబ ప్రయోజనాలు కాపాడటమే కెసిఆర్ లక్ష్యం.
రాష్ట్ర హక్కులను కాపాడేందుకు సీఎం కెసిఆర్ కు చిత్తశుద్ది ఉంటే రాజకీయ పక్షాలను ఏకం చేసి జంతర్ మంతర్ వద్ద దీక్ష చెయ్యి..
ఎన్ని పన్నాగాలు పన్నినా టీ ఆర్ఎస్ కు ఎన్నికల్లో గుణపాఠం తప్పదు..
పోటీలో ఎన్ని పార్టీలు ఉన్నా విధానాలపై పోటీ జరుగుతాది.
2014కు ముందు పదేళ్ల కాంగ్రెస్ పాలన..బీజేపీ పదేళ్ల పాలన, రాష్ట్రంలో టీ ఆర్ ఎస్ పాలనను బేరీజు వేసుకుని ఓటర్లు తీర్పు ఇస్తారు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
సమావేశం లో పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, పులి రాము, రామ్ చంద్రా రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు, శేకర్, బీరం రాజేష్, లైసెట్టి విజయ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దర రమేష్ బాబు, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్, పట్టణ అధ్యక్షుడు నేహాల్, అసిఫ్ పాషా, పాల్గొన్నారు.
జగిత్యాల లో కెసిఆర్ బొమ్మ దగ్గం!

హైదరాబాద్ లో నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల వ్యూహకర్త సునీల్ కార్యాలయంపై దాడి చేసిన పోలీసుల వైఖరికి నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా భవన్ నుండి ర్యాలీ గా బయలుదేరి స్థానిక తహసీల్ చౌరస్తాలో నిరసన ధర్నా చేపట్టి ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం చేసిన కాంగ్రెస్ నాయకులు.,.
ధర్మపురిలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం!

కాంగ్రెస్ పార్టీ అధికారిక వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీస్ పై పోలీస్ దాడి చేసి వాళ్ళ కంప్యూటర్ లు సీజ్ చేయడన్ని నిరసిస్తూ ధర్మపురి లోని నంది చౌక్ వద్ద కేసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.