బుగ్గారం జిపి “‘నిధుల దుర్వినియోగం పై”‘
నోటీసులు జారీచేసిన “‘లోకాయుక్త”‘

(J.Surender Kumar)

జగిత్యాల జిల్లా మండల కేంద్రమైన బుగ్గారం గ్రామ పంచాయతీ లో జరిగిన భారీ నిధుల దుర్వినియోగం పై ఈనెల 15న “‘లోకాయుక్త”‘ (హైదరాబాద్ కోర్టులో) లో విచారణ జరుగనుందని చుక్క గంగారెడ్డి తెలిపారు.

శుక్రవారం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నక్క చంద్రమోళి అధ్యక్షతన బుగ్గారం లో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో పాల్గొన్న విడిసి కోర్ కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి బుగ్గారం గ్రామపంచాయతీ లో జరిగిన భారీ నిధుల దుర్వినియోగం గూర్చి ప్రసంగించారు. .
గత సెప్టెంబర్ 21న  “‘లోకాయుక్త”‘ (కోర్టులో) జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులపై పిర్యాదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. లోకాయుక్త ఆప్ తెలంగాణ యొక్క రిజిస్ట్రార్ నోటీసులు జారీ చేసిందని వివరించారు. ఈనెల 15న ఉదయం 11-00గంటలకు లోకాయుక్త కు హాజరు కావాలని ఆ నోటీసుల ద్వారా ఆదేశించారన్నారు.