కొండగట్టు ఆదాయం కొల్లగొడుతున్నది ఎవరు ?
అంజన్న సొమ్ము… అందినంత మింగు !
(J. Surender Kumar)
(పార్ట్ – 2)
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 2020 ఆర్థిక సంవత్సరంలో, 202 (రెండు వందల రెండు) రోజులపాటు మూసి ఉన్న, నిర్వహణ పేరిట లక్షలాది రూపాయల ఖర్చులు ఎలా చేశారు ? ఎవరి కోసం చేశారో.? అంతు పట్టని మిస్టరీగా. మిగిలింది. రికార్డులలో నమోదైన ఖర్చుల వివరాలు మాత్రం అంజన్న భక్తులను ఆయోమయంతో పాటు, ఆందోళనకు గురిచేస్తు వారిని నివ్వెర పరుస్తున్నాయి అనేది మాత్రం నిజం.

152 రోజులు కలుపుకొని దాదాపు ₹ 40,07,775/- ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి!
తేదీ.11-10-2020 నుంచి .31-3-2021 వరకు ఆలయం తెరిచి ఉంది. తిరిగి తేది 1-4-2021 నుంచి 30-6-2021, వరకు లాక్ డౌన్ విధించారు (ఆలయాలు మూసి ఉన్నాయి) కొన్ని పద్దులలో ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి!
*తడుకలు మరియు పందిళ్లు ₹ 3,24,706/- * కేశఖండన శాల నిర్వహణ ₹ 1,36,209/- * శ్రీ హనుమాన్ జయంతి ₹ 2,07,255/- * వార్షిక పండుగలు ₹ 3,07,755/- .* విద్యుత్తు దీపాలంకరణ ₹ 86,800/- * కరెంటు సామాగ్రి 500/- *వాటర్ సప్లై సామాను ఖరీదు నిర్వహణ ₹ 1,31,973/- * యం అండ్ ఆర్ వర్క్స్ ₹1,73,986/- * గోశాల నిర్వహణ ₹ 1,20,350/- * టి ఏ మరియు డి ఏ బిల్లులు ₹ 4,880/- * కారు అలవెన్స్ ₹ 2,94,500/- * నూతన కట్టడాలు ₹ 15,36,424/- * కరెంటు & వాటర్ సప్లై సామాగ్రి ₹,1,84,305/-. * కరెంటు సామాగ్రి ఖరీదు ₹ 89,000/- * ఆగమ పాఠశాల నిర్వహణ ₹ 4,06,152/- * గార్డెన్ నిర్వహణ. ₹ 2,880/- తదితర వాటికి (కొన్ని మాత్రమే) ఖర్చు చేసినట్టు ఆలయ రికార్డులలో నమోదయింది.
ఆలయం మూసి ఉన్న ఆ ఖర్చులు ఎవరికోసం ?

కరోనా నేపథ్యంలో మూసి ఉన్న ఆలయంలో వీఐపీ ప్రోటోకాల్, ధర్మకర్తల టి ఏ డి ఏ, ధర్మశాల నిర్వహణ, చలివేంద్రాలు, పేరిట రికార్డులలో ఎలాంటి ఖర్చులు నమోదు చేయనట్టు సమాచారం. .అయితే వాటర్ సప్లై సామాగ్రి ఖరీదు నిర్వహణ పేరిట.₹ 1,31,973/-ఖర్చు అయినట్టు నమోదు చేయగా, మరోసారి కరెంటు మరియు వాటర్ సప్లై సామాగ్రి కొనుగోలు పేరిట ₹ 1,84,305/- అదనంగా కరెంటు సామాగ్రి కొనుగోలు పేరిట ₹ 89,000/- ఖర్చుల వివరాలు నమోదు చేశారు.

దీనికి తోడు. అధికారి కారు అలవెన్స్ పేరిట ₹ 2,94,500/- డిఎడిఎ బిల్లులు 4,880/- గార్డెన్ నిర్వహణ పేరిట ₹ 2,880/- ఫర్నిచర్ కొనుగోలు పేరిట ₹24,010/- కరోనా, లాక్ డౌన్ లో ఆగమ పాఠశాల నిర్వహణ ఎలా జరిగింది ? నిర్వహణ పేరిట ₹ 4, 06,152/- ఖర్చు అయినట్లు నమోదు చేయడం తో భక్తజనం పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.