కరోనా మహమ్మారి పట్ల  జాగ్రత్తగా ఉండండి !

రాష్ట్రలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు.!

(J. Surender Kumar)

అనేక దేశాల్లో కరోనా ఇన్ఫెక్షన్ పెరిగిన నేపథ్యంలో నిపుణులు, అధికారుల సమీక్షా సమావేశం జరిగింది.
ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. జపాన్, అమెరికా మరియు చైనా వంటి దేశాలలో, కరోనా సంభవం మళ్లీ పెరిగింది.  మరియు కరోనా పరీక్ష కోసం తీసుకుంటున్న చర్యలపై భారతదేశం మరింత సీరియస్‌గా చూపించాలని కోరారు. 

రాష్ట్రాలు కరోనా రోగుల రక్త నమూనాలను, ప్రతిరోజూ జన్యు ప్రయోగశాలకు పంపాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.  ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ,అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. మన్సుఖ్ మాండవ్య ఢిల్లీలో సీనియర్ అధికారులు, నిపుణులతో సమావేశమయ్యారు. మంత్రులు, అధికారులంతా మాస్కులు ధరించి సమావేశంలో పాల్గొన్నారు.
సంప్రదింపుల తర్వాత, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తన ట్విట్టర్ పేజీలో ఒక వ్యాఖ్యను పోస్ట్ చేశారు..

భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్

భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది.
ఒమిక్రాన్ బీఎఫ్ 7 గుజరాత్లో ఇద్దరు, ఒడిశాలో ఒకరిలో గుర్తించారు. చైనాలో ఇటీవల కరోనా వ్యాప్తికి కారణమైన ఈ వేరియంట్ దేశంలోకి ప్రవేశించడంతో అప్రమత్తమైన కేంద్రం అన్ని విమానాశ్రయాలలో. అలర్ట్ ప్రకటించింది.