కరోనా ఉధృతి పై ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం!

(J. Surender Kumar)

దేశంలో కరోనా పరిస్థితిపై గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత సమావేశం నిర్వహించారు. కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ, సహా సీనియర్ అధిరులతో చర్చలు జరిపారు. దేశంలో కరోనా వ్యాప్తి, కొత్త వేరియంట్ కేసులపై మోదీ ఆరా తీసినట్లు సమాచారం..

చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాతో పాటు కొవిడ్ అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ర్యాండమ్​గా కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కేంద్రం కోరుతోంది. త్వరలో వరుస పండుగలు రానున్న నేపథ్యంలో ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలని మాండవీయ సూచించారు.

కరోనా పరిస్థితిపై పార్లమెంట్​లో మాట్లాడిన ఆయన. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. భారత్​లో మాత్రం తగ్గుతున్నాయని తెలిపారు. చైనాలో కొవిడ్​ కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలో మహమ్మారి కట్టడి చేయడంలో కేంద్ర చురుగ్గా వ్యవహరిస్తోందని అన్నారు. కొత్త వేరియంట్ ప్రమాదం.

చైనాలో కొవిడ్ విజృంభణకు కారణమైన, బీఎఫ్.7 రకం కరోనా వేరియంట్ భారత్​లోనూ వెలుగులోకి వచ్చింది. తొలి కేసును గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్.. అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా బీఎఫ్‌-7 వేరియంట్ కేసులు ఇప్పటివరకు 4, నమోదైనట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అందులో 3, గుజరాత్‌లో నమోదుకాగా.. మరో కేసు ఒడిశాలో వెలుగుచూసినట్లు పేర్కొన్నాయి. కాగా దేశంలో కొత్తగా 185, కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి ఒకరు మరణించారు అని వివరించారు.