జగిత్యాల జిల్లా కేసుల వార్షిక నివేదిక…
వెల్లడించిన ఎస్పీ సింధు శర్మ !
(J. Surender Kumar)
జగిత్యాల జిల్లాలో గత సంవత్సరం నమోదైన కేసుల సంఖ్య కంటే ఈ సంవత్సరం తగ్గాయి, గత సంవత్సరం జరిగిన హత్యలు కంటే ఈ సంవత్సరంలో నాలుగు హత్యలు అదనంగా పెరిగాయి. వార్షిక కేసుల వివరాలను ఎస్పీ శ్రీమతి సింధు శర్మ గురువారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రకటించారు. పోలీస్ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న గణాంకాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి!.
2021 సంవత్సరంలో 5759 కేసులు నమోదు కాగా, 2022లో 5056 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరం కంటే 703 కేసుల సంఖ్య తగ్గింది. గత సంవత్సరం 25 హత్యలు జరగగా 2022లో 29 హత్యలు జరిగాయి. ఈ సంవత్సరంలో అదనంగా నాలుగు హత్యలు పెరిగాయి. గత సంవత్సరం తుపాకితో హతమార్చిన సంఘటన లేకున్నా, ఈ సంవత్సరంలో ఒకరు హత్యకు గురి అయ్యారు. గత సంవత్సరం 307 IPC 64 కేసుల నమోదు కాగా, ఈ సంవత్సరం 74. కేసులో నమోదయ్యాయి, అదనంగా 10 కేసులు పెరిగాయి. గత సంవత్సరం రాబరీ కేసులు 11 నమోదు కాగా ఈ సంవత్సరం 26 కేసులు నమోదయ్యాయి, అదనంగా 15 కేసులు పెరిగాయి. గత సంవత్సరం 49 రేప్ కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 35 కేసులు నమోదయ్య గత సంవత్సరం కంటే 14 కేసులు తగ్గాయి. గత సంవత్సరం కిడ్నాప్ కేసులు 50 కాగా. ఈ సంవత్సరం 27 కేసులు నమోదు ఐ అయినాయి. గత సంవత్సరం కంటే 23 కేసులు తగ్గాయి.
హత్యల తీరుతెన్నులు!
కుటుంబ కలహాల నేపథ్యంలో ఐదుగురు, డబ్బుల వివాదంలో ఒకరు, భూవివాదంలో ఆరుగురు, పాత కక్షలు నేపథ్యంలో ఎనిమిది మంది, లైంగిక అత్యాచారం హత్యలో ఇద్దరు, వరకట్నం వేధింపుల ఒకరు, చిన్నపాటి గొడవల్లో నలుగురు, గుర్తుతెలియని హత్య తీరు ఇద్దరు.
దొంగలించిన సొమ్ము రికవరీ!
61.80 గ్రాముల బంగారం, 40.60 గ్రాముల వెండి రికవరీ శాతం 46.77%
రోడ్డు ప్రమాదంలో 200 మంది మృతి !
391 జరిగిన ప్రమాదాలలో 200 మంది మృతి చెందారు, 451 మంది గాయపడ్డారు. ఇందులో స్వతగా వాహనాలతో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురి అయి. మృతి చెందినవారు 74 మంది ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ కేసులు వంద నమోదయ్యాయి, రేషన్ బియ్యం పట్టివేతలో 122 కేసులలో 213 మంది పై నమోదు .₹ 6,021,270/- విలువగల బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. ఆన్లైన్ గేమ్లు 536 మంది పై.109 కేసులు నమోదు కాగా ₹,16,91,045/- నగదు స్వాధీనం. 106 మందిపై 74 గుట్కా కేసులు నమోదు చేసి ₹26,66,070/- విలువ గుట్కాలు స్వాధీనం. ఇసుక అక్రమ రవాణాలో 524. మందిపై 286 కేసులు నమోదు 302. వాహనాలు స్వాధీనం ₹,1,62,4500/- ఇసుక విలువ
డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగాయి!
2021 లో 4058 కేసులు నమోదు కాగా..2022 లో 8619 కేసు నమోదు.
లోక్ అదాలతో 11518 కేసులు పరిష్కారం జరిగాయి.
ఇందులో 5795 డ్రంక్ అండ్ డ్రైవ్, 4907 పిటికేసులు, 816. ఐపిసి కేసులు.
అక్రమ ఫైనాన్స్ 26 కాగా, 30 మంది అరెస్టు. ₹3,91,48,170/- విలువ గల డాక్యుమెంట్లు స్వాధీనం.
ఈ చలాన్ కేసులు.
2,36,773. కాగా, వాట్సాప్ ద్వారా 87 ఫిర్యాదు రాగా 19 ఎఫ్ఐఆర్లు జారీ . ట్విట్టర్ ద్వారా 132 ఫిర్యాదులు మూడు ఎఫ్ఐఆర్లు జారి. 100 డయల్ ద్వారా 24091 ఫిర్యాదులు.252 ఎఫ్ఐఆర్లు జారీ చేశామని, తదితర వివరాలను ఎస్పి సింధు శర్మ వివరించారు..
జిల్లా పోలీస్ యంత్రాంగం, ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పాటు, ప్రజల సహాయ సహకారాలతో శాంతి భద్రతలు కాపాడగలిగామని, నూతన సంవత్సరంలో ఇదే సహకారాన్ని పోలీసు యంత్రాంగం కొనసాగిస్తుందని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.