వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలని ఆదేశం !
(J. Surender Kumar)
ఓ చిట్ ఫండ్ కంపెనీ లో చిట్టి కట్టిన వినియోగదారుడికి సంవత్సరాల తరబడి లక్షలాది రూపాయలు, వినియోగదారుడి డబ్బులు ఆ కంపెనీ చెల్లించకపోవడంతో అతడు వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించి న్యాయం పొందాడు.
వివరాల్లోకి వెళ్తే …
జగిత్యాల జిల్లా మల్యాల మండలం, ఓబులాపూర్ గ్రామానికి చెందిన రైతు గుగ్గిళ్ళ తిరుపతి, కోరుట్ల పట్టణంలోని ప్రముఖ చిట్ ఫండ్ విపంచి కంపెనీ లో ఐదు లక్షల చిట్టీలోచేరాడు. ప్రతి నెల డబ్బులు చెల్లించాడు, చిట్టి కాలపరిమితి ముగిసినా రైతు.తిరుపతికి కంపెనీ డబ్బులు చెల్లించలేదు.

రెండు చెక్కులను ఇచ్చారు. ఆ చెక్కులు బ్యాంకులో తిరస్కరించబడ్డాయి. ఈ దశలో విసిగి వేసారిన రైతు తిరుపతి, ప్రముఖ న్యాయవాది మెట్ట మహేందర్ ద్వారా జిల్లా వినియోగదారుల ఫోరంను గత కొన్ని సంవత్సరాల క్రితం న్యాయం కోసం ఆశ్రయించారు.
కేసు పూర్వపురాలు విచారించిన ఫోరం అధ్యక్షురాలు స్వరూప రాణి ,సభ్యులు శ్రీలత ,నరసింహారావు లు.
ఐదు లక్షల చిట్టి కాల పరిమితి ముగిసిన నాటి నుండి ₹ 4,74,250/- కు 9% వడ్డీతో కలిపి వినియోగదారుడికి మొత్తం చెల్లించాలని ఆదేశించారు. దీంతోపాటు మానసిక వేదనకు గురి చేసినందుకు రైతు తిరుపతికి ₹ 5000/- నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్లను ఆదేశిస్తూ గత నెల 29న ఉత్తర్వులు జారీ చేశారు.