లేకుంటే ఎమ్మెల్యేఇంటి ముందు ధర్నాచేస్తాం!
టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు!
(J.Surender Kumar)
మెటుపల్లి మండలం చౌలమద్ది గ్రామ బ్రిడ్జిని పూర్తి చేయాలిని టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు తో కలిసి చౌలమద్ది గ్రామస్తులు శనివారంబ్రిడ్జి దగ్గర ధర్నా నిర్వహించారు.. ఈ సందర్భంగా కృష్ణారావు.మాట్లాడుతూ
,కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బ్రిడ్జిని మంజూరు చేస్తే, ఇప్పటి వరకు పూర్తి కాలేదు అన్నారు..ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కు అన్యాయం జరిగింది అని అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మన రాష్ట్రం మనకు వచ్చిన మా చౌలమద్ది బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయలేదు అని ఆరోపించారు..రైతులు బ్రిడ్జి దాటి వెళ్ళాలి అంటే ప్రతి ఏడాది 2 లక్షల రూపాయలు ఖర్చు ఓపెట్టుకుంటున్నారు అని ,రైతుల ఎంత ఇబ్బందులు పడుతున్న మన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కంటికి కనిపించడం లేద అని అన్నారు. ఎమ్మెల్యే కు చిత్త శుద్ది ఉంటే వేటనే బ్రిడ్జి పూర్తి చేయాలని అని అన్నారు. లేని పక్షంలో ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా కు దిగుతామని కృష్ణ రావు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె. లింగారెడ్డి. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మెటుపల్లి మండల వైస్ ప్రెసిడెంట్ రాజు. గ్రామస్థులు తీగల చిన్న రాజన్న. గడ్డం రాజేందర్. లింగపురం పెద్ద గంగారెడ్డి. లింగపురం రాజేశేఖర్. పడిగల రమేష్. చిలివేరి లక్ష్మీ నారాయణ. మదం నడిపి రాజాం. మెటుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందే మారుతి.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు..