(J. Surender Kumar)
ధర్మపురి నియోజకవర్గంలో 36 గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 3,686 గ్రామాలకు నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు అయిన విషయం తెలిసిందే, ఇందులో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం 36 నూతన గ్రామ పంచాయతి భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి
ఇందులో భాగంగా,
బుగ్గారం మండలం లో….గోపులాపూర్, శకల్ల,
వెల్గొండ,
ధర్మపురి మండలంలో* బుద్దేశ్ పల్లె,
బూరుగుపల్లె, దుబ్బలగూడెం, గోవిందుపల్లె
గొల్లపల్లి మండలం లో చెందోళి, దమ్మన్నపేట, దట్నూర్, గంగాదేవి పల్లే,
గోవిందుపల్లే, ఇబ్రహీంనగర్,
ఇస్రాజ్ పల్లే,
పెగడపల్లి మండలంలో బతికపెల్లి, నామాపూర్, నార్సింహునిపేట్,
వెల్గటూర్ మండలంలో కిషన్ రావు పేట, కొత్తపేట, రాజక్కపల్లె, తాళ్ళకొత్తపేట,
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో…
బొమ్మిరెడ్డిపల్లె, బొట్లవనపర్తి, చామనపల్లి, దొంగతూర్తి, కటికెనపల్లి, ఖానంపల్లి, ఖిలావనపర్తి, కొత్తపల్లి, కొత్తూరు, లంబాడీ తాండ (k), మల్లాపూర్, పెరకపల్లి, రచ్చపల్లి, రామయ్య పల్లి, సాయంపేట, గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి మంజూరు అయ్యాయి
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 3,686 పంచాయతీలకు సొంత భవనాలను మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున, మొత్తంగా రూ.737 కోట్ల వరకు ఖర్చు చేయనున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,769 గ్రామ పంచాయతీలు
పరిపాలన సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేసిన ప్రభుత్వం, పాత గ్రామ పంచాయతీల్లో నూ శిథిలావస్థకు చేరిన కార్యాలయాల స్థానంలో నూతన భవనాలు ఏర్పాటు చేయనున్నారు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి శాఖల ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం చేపట్టనున్నారు