సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలి!

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!

(J. Surender Kumar)

జగిత్యాల జిల్లా కేంద్రంకు జిల్లా ఈనెల 7న  ముఖ్యమంత్రి కెసిఆర్ రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనను, భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  నాయకులను కోరారు. 

శుక్రవారం పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  అర్బన్, రూరల్ మండల ముఖ్య నాయకులు కార్యకర్తల తో సమావేశం ఏర్పాటుచేసి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు.

శంకులపల్లి లో పౌష్టికాహారం పంపిణీ !

పట్టణంలోని శంకులపల్లి లోనీ అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందించే కోడిగుడ్లు, బాలామృతం వంటి పౌష్టికాహారాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ తోట మల్లికార్జున్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నీరజ, ఆర్పీ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

బ్రిడ్జి నిర్మాణం కోసం రాస్తారో !

కథలా మం. సిరికొండ తక్కళ్ళపల్లి వాగుపై గల వంతెనను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బిజేపి కిసాన్ మొర్చా అధ్యక్ష్యులు కొడిపల్లి గోపాల్ రెడ్డి, తక్కలపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
రోడ్డుపై దాదాపు మూడు గంటలు ధర్నా చేయగా, కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రిడ్జి పనులు మొదలుపెట్టి ఇప్పటికీ పూర్తి చేయని ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు దక్కుతుందని, ఈ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, సిరికొండ తక్కలపల్లి ఎక్స్ రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు.,

అర్జిత సెలవులు మంజూరు చేయాలి !

SSC  పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2022 వేసవి సెలవులలో  పరీక్షా కేంద్రాల లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి జగన్ మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన PRTU TS జగిత్యాల ఉపాధ్యాయ సంఘం నాయకులు.
ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి   ఆనంద్ రావ్, స్టేట్ సెక్రటరి లు వీర బతిని రాజగోపాల్, సత్యరాజ్,  జిల్లా బాధ్యులు మచ్చ రాజశేఖర్  హరీశ్, B.శ్రీనివాస్, లక్ష్మి నారయణ, శేషా చలపతి తదితరులు పాల్గొన్నారు.

నిరసన.


వనపర్తిలో వాసవి మాత ఆలయం విగ్రహం కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం బీర్ పూర్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆర్య వైశ్య సంఘం నాయకుల నిరసన ప్రదర్శన నిర్వహించారు.
వనపర్తి లో వాసవి మాత ఆలయం విగ్రహం ధ్వంసం చేసిన వారిపై ప్రభుత్వం వెంటనె చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాత రమేష్, ఉపాధ్యక్షుడు ఎలగందుల అశోక్, పాత రమేష్, ప్రదాన కార్య దర్శి రేగొండ రమేష్, కోశాధికారి అక్కిన పెల్లి రాము, సంఘం సభ్యులు కాసం ఈశ్వరయ్య అక్కినపెల్లి రాజయ్య, శ్రీనివాస్ వేణుగోపాల్ , గోపాల్  ఎలగందుల అనిల్, జొన్నల శ్రీనివాస్, గుండ సురేష్  అనంతల సత్తయ్య,  గుండ వంశీ, చెట్ల శేకర్,  చెర్లపెల్లి అంజయ్య, మండల వైశ్యసంఘం  నాయకులు సభ్యులు పాల్గొన్నారు