C.M.O. కార్యాలయంలో I.A.S అధికారిని స్మితా సబర్వాల్ !

సక్సెస్ స్టోరీ


(J.Surender. Kumar)

ఆమె పని తీరు చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె సింప్లిసిటీ, విధి నిర్వహణలో అసలు సిసలైన పనితనం, నిజాయితీ, ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే వేషధారణతో అత్యధిక శాతం ప్రజలు ఆమెను ఎనలేని గౌరవ భావం తో ఆదరిస్తున్నారు. తెలంగాణ సీఎంలో తొలి ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్.!. గూర్చి..

స్మితా సబర్వాల్ 19 జూన్ 1977న పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జన్మించారు. తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ ప్రణబ్ దాస్.  తల్లి పేరు పురబీ దాస్. తండ్రి ఆర్మీ ఉద్యోగం కారణంగా, స్మిత వివిధ నగరాల్లో పెరిగింది. పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. స్మిత అక్కడే చదువుకుంది. ఆమె 12వ తరగతిలో, టాపర్‌గా నిలిచింది.  కామర్స్ స్ట్రీమ్ నుండి గ్రాడ్యుయేషన్ చేసింది

స్మితా సబర్వాల్ తన మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయినా పట్టు వదలకుండా రెట్టింపు శ్రమతో మరో మరో పరీక్షకు సిద్ధమైంది. 2000 సంవత్సరంలో ఆమె రెండవ ప్రయత్నంలో, UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అతి పిన్న వయస్కురాలు.(23) 

  ఆల్ ఇండియా స్థాయిలో 4వ ర్యాంక్ సాధించింది. స్మిత తెలంగాణ కేడర్ నుంచి ఐఏఎస్ శిక్షణ తీసుకుంది. నియామకం తర్వాత ఆమె చిత్తూరులో సబ్ కలెక్టర్‌గా కొనసాగారు. 

కడప రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా  కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆమె తెలంగాణలోని వరంగల్, విశాఖపట్నం, కరీంనగర్, చిత్తూరులలో పోస్టింగ్ పొందారు. ప్రతిచోటా ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం ఆమె పనితీరును ప్రశంసించేవారు.

ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ పనితీరు సింప్లిసిటీ గురించి 2015లో  బీబీసీ లో వార్తా కథనం, జాతీయ అంతర్జాతీయ, పత్రికలు, ప్రచార సాధనాల్లో ఆమె విజయ గాద, స్మిత సబ్రవాల్ . పనితీరు పై. కథనాలు ప్రచురితం అయ్యాయి.


తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమితులైన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి ఐఏఎస్ స్మిత .

దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. స్మిత IPS అధికారి డాక్టర్ అకున్ సబర్వాల్ ను వివాహం చేసుకుంది. 

వీరికి ఇద్దరు పిల్లలు నానక్ సబర్వాల్, భువిష్. స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది. ఆమె పని తీరు, పేదలకు సహాయం చేయాలనే అభిరుచి అభినందనీయం.