సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి !

మంత్రి కొప్పుల ఈశ్వర్

(J.SURENDER KUMAR)

ఈ నెల 7 న సీఎం జగిత్యాల పట్టణ పర్యటనను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ , జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి వసంత, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, శాసన సభ్యులు డా సంజయ్ కుమార్, విద్యా సాగర్, కలెక్టర్ జి రవి, ఎస్పీ శ్రీమతి సింధు శర్మ లతో పర్యటన ఏర్పాట్ల ను IDOC, మోతె, వైద్య కళాశాల వద్ద పరిశీలించారు.


ఏమైనా పనులు మిగిలి ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. పర్యటన ఆద్యాంతం సజావుగా జరిగేలా చూడాలన్నారు.
ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీస్ లు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలనీ సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ….
పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయని అన్నారు.
అంతకుముందు ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హల్ లో సమీక్షించారు.


సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్ జిల్లా అదనపు కలెక్టర్ లు మందా మకరంద్, శ్రీమతి బిఎస్ లత, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.