సీఎం పర్యటన ప్రశాంతంగా ముగిసింది…
ఖాకిలలో పరేషాన్ మొదలైంది ?

(J. Surender Kumar)

సీఎం కేసీఆర్ ఈనెల 7న జగిత్యాల పట్టణంలో జరిపిన పర్యటన ప్రశాంతంగా ముగిసిన,  ఖాకి ల లో పరేషాన్ మొదలైనట్టు చర్చ జరుగుతుంది.  నూతన కలెక్టరేట్ భవనము, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ప్రారంభోత్సవాలు, మెడికల్ కళాశాల భూమి పూజ, తదితర కార్యక్రమాల్లో ఎలాంటి లోటు పాట్లు జరగకుండా పోలీస్ వర్గాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పట్టణ శివారు మోతే గ్రామం వద్ద జరిగిన బహిరంగ సభ సైతం విజయవంతమైంది. అయినా పోలీస్ వర్గాల్లో పరేషాన్ కు, ప్రశ్నార్థకమైన సమస్య ఏమిటంటే, సీఎం సభకు వస్తున్న వాహనాలు కొన్ని ట్రాఫిక్ లో జామ్ కావడం, కొన్ని వాహనాలు జగిత్యాల వైపు రాకుండా పోలీసులు అడ్డుకోవడం కారణంగా చర్చ నెలకుంది.  మెట్టుపల్లి  .గంగాధర నుండి జగిత్యాలకు వస్తున్న టిఆర్ఎస్ శ్రేణుల గులాబీ జెండా ఉన్న వాహనాలను   అడ్డుకోవడమే పోలీస్ వర్గాల్లో పరేషాన్ కు కారణంగా చర్చ.

సీఎం ప్రసంగంలో ట్రాఫిక్ జామ్ గూర్చి…

సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్ సబికులను ఉద్దేశించి అభినందిస్తూ మెట్టుపల్లి,  జగిత్యాల మధ్య ట్రాఫిక్ లో చిక్కుకున్న వారికి, కొండగట్టు నుంచి ట్రాఫిక్ లో చిక్కుకున్న వారికి అభినందనలు తెలపడం, వీరిలో కలవరం కు మరో కారణం అయిందనే చర్చ.  దీనికి తోడు ధర్మపురి లో గోదావరి పుష్కరాలు ఘనంగా జరుపుకున్నాం. ట్రాఫిక్ లో వాహనాలు జామ్ అయితే మంత్రి హరీష్ రావు, మరికొందరు మంత్రులు ట్రాఫిక్ కానిస్టేబుల్ తరహాలో నిలబడి పనిచేసి పుష్కరాలు విజయవంతం చేశారని సీఎం ఈ సందర్భంగా వారిని ప్రశంసించడంతో పోలీస్ వర్గాల్లో మరింత పరేషాన్ పెరిగిందనే చర్చ.  సభా ప్రాంగణంలోకి సీఎం రావడానికి ముందు నుంచే ట్రాఫిక్ లో చిక్కుకున్న గులాబి శ్రేణులు, వాహనాల బాధ్యతలు చేపట్టిన నాయకులు, తమ వాహనాలను జగిత్యాల వైపుకు రానివ్వడం లేదు అంటూ, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, కీలక ప్రజాప్రతినిధులకు ఫోన్లో ద్వారా వివరిస్తూ, మన ప్రభుత్వంలో మనల్ని అడ్డుకుంటారా ?  మన వాహనాలనే ఆపుతారా ?  అంటూ. కీలక నేతలను నిలదీసినట్టు చర్చ నెలకుంది. ఫలానా పోలీసులు, ఫలానా పోలీస్ అధికారి , మా వాహనాల పట్ల అతిగా ప్రవర్తిస్తున్నారు ,అంటూ వారు తమ తమ నాయకులకు ఫిర్యాదులు చేసినట్టు చర్చ. దీంతో కొందరు  నాయకులు ఓ కీలక ప్రజా ప్రతినిధికి ఈ ఎపిసోడ్ ను వివరించినట్టు సమాచారం.
ట్రాఫిక్ జామ్, వాహనాల నిలుపుదల, వాహనాలను అడ్డుకున్న అధికారులు, పోలీసులు ఎవరు ?  జగిత్యాల నుంచి నిజాంబాద్, కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు ఎందుకు ఆపలేదు ?  అటువైపు నుంచి జగిత్యాల వచ్చే వాహనాలు ఆపడంలో ఆంతర్యం ఏమిటి ?  అంటూ సమగ్ర నివేదిక కావాలి అని  బుధవారం రాత్రి  ప్రగతి భవన్ నుండి పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.  ఈ మేరకు ఇంటిలిజెన్సీ నివేదిక గురువారం నాటికి సిద్ధం చేసినట్టు సమాచారం. కరీంనగర్.మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహం, శుక్రవారం భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం కార్యక్రమాల నేపథ్యంలో ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో, కీలక నేత చర్చించలేదని సమాచారం. కొందరి పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటారా ? బదిలీ వేటు పడుతుందా ? ఈ అంశంను  చూసి చూడనట్టుగా పట్టించుకోరా ? అనే విషయం వెలుగు చూసే వరకు ఖాకి వర్గాల్లో కలవరం అలాగే కొనసాగుతుంది కాబోలు.