కాంగ్రెస్ అధికారంలోకి రావడం చారిత్రాత్మక ఆవశ్యకం!

హాత్ సే హాత్ జోడో సమీక్ష సమావేశంలో…

గడప గడపకు కాంగ్రెస్ పథకాలు తీసుకెల్లాలి!

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,!

(J. Surender Kumar)

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చరిత్రత్మక ఆవశ్యకత ఉందని, పొట్ట బుద్దురుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలో శనివారం కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో అభియాన్ నాయకుల కార్యకర్తలసమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..

కాంగ్రెస్ పాలన లో క్వింటాల్ కి రు.500 నుండి రు1350కి 150 శాతం పెరిగింది..
రాబోయే కాంగ్రెస్ పాలనలో ధాన్యం క్వింటాల్ కు రు.2500 ఇస్తం.
ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేయాలి..
కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు వైఫల్యాలు, అవినీతిని ప్రజలకు వివరించాలి..
గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు తెల్సుకుని, పరిష్కరించేందుకు కృషి..
బడుగు, బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ..ప్రప్రంచంలో శాంతి నెలకొల్పేందుకు ప్రాణాలు అర్పించిన త్యాగశీల కుటుంభం..
దేశంలో అన్ని మతాలను ఐక్యంగా చేసేందుకు, నిరుపేదలకు అండగా నిలిచేందుకు భారత్ జో డో యాత్రను రాహుల్ గాంధీ చేపట్టారు.
రు.2500 పెన్షన్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటిస్తాం.
కేజీ టు పీజీ అమలు చేసి చూపిస్తాం.
కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 వరకు కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రజాహిత కార్యక్రమాలు, 2014 నుండి2022 వరకు టిఆర్ ఎస్, బీజేపీ పాలనతో పోల్చి చూడాలి.
కొనుగోలు కేంద్రాలు ప్రారంబించింది కాంగ్రెస్..
కల్లం కాడ ధాన్యం కొనుగోలు చేసం..
అడ్తి లేదు..హమాలీ లేదు.. రవాణా లేదు..
రైతు బంధు పేరిట టిఆర్ ఎస్ రాయితీలు అన్ని నిలిపివేసింది. నాలుగేళ్లు గడుస్తున్న రుణ మాఫీ చేయలేదు.
పంట రుణం 4 శాతం ఇవ్వల్సి ఉండగా, 8ఏళ్ల నుండి టీ ఆర్ ఎస్ ఒక్క రూపాయి ఇయ్యలేదు.
కాంగ్రెస్ పాలనలో స్వల్పకాలిక రుణాలు పై 4 శాతం, దీర్ఘ కాలిక రుణాలపై 6శాతం ఇచినం.
కెసిఆర్ కు చిత్తశుద్ది ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రాయితీలు ఇస్తు రైతు బంధు కొనసాగించాలి.
ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి చేపట్టే పీఆర్సి కి. ఇచ్చినట్టే పెన్షన్ రు.2000 ఇవ్వాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తే. కేటీఆర్ ఎద్దేవా చేశారు..మార్క్ ఫెడ్ కనుమరుగైంది. చక్కర ఫ్యాక్టరీ లో వాటా ఉన్నది అమ్ముకునెందుకేన తెలంగాణా..
హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదని నిరాహార దీక్ష చేసి ఇప్పుడు ఫ్రీ జోన్ ఇప్పుడు ఎలా అయింది.
ఖమ్మంలోని 7 మండలాలు, సీలేరు ప్రాజెక్ట్ ను ఆంధ్రకు అప్పనంగా కట్టబెట్టిండు.
58 ఏళ్ల లో రు.60 వేల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణలో 8 ఏళ్ల లో 5 లక్షల కోట్ల అప్పులు ఐనయ్. అంటూ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీశారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్. మాట్లాడుతూ…

జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ నియోజక వర్గాల్లో జో డో యాత్రను జనవరి 26 నుండి చేపట్టనున్నారు.
గడప గడప కు కాంగ్రెస్ను తీసుకెళ్లేందుకు కృషి చేయాలి..
బీ ఆర్ఎస్, పెన్షన్, రైతు బంద్ పై, బీజేపీ మతంపై అదారపడింది.
కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న వారిపై కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారు.
కాంగ్రెస్ బతికితేనే.. మనం బతుకుతం..
కార్యకర్తలు నిరుత్సాహపడొద్దు.. పార్టీనీ బలోపేతం చేసేందుకు ఐకమత్యంతో పని చేయాలి.
కష్టకాలంలో కాంగ్రెస్ వెంట నడిచిన కార్యకర్తలకు గుర్తింపు.
కాంగ్రెస్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ
అన్ని మండలాల ను కలుపుతూ పాదయాత్ర చేపట్టాలి..
కాంగ్రెస్ పాలనలో 108, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు వివరించాలి..
జీవన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్లాలి.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చిన ఘనత జీవన్ రెడ్డిది.
కాంగ్రెస్ ను అధికారంలోకి వస్తేనే. ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరుస్తాయి.
బీజేపీ చేసింది ఏమీ లేదు..చెప్పుకోవడానికి ఏమీ లేదు.
సమన్వయంతో పని చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం తేలిక..
రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం..
హాత్ హాత్ సే జో డో పాదయాత్రను విజయవంతం చేయాలి.
బూతు స్థాయి నుండి కమిటీలను వేసి, పార్టీని పటిష్టం చేయాలి.. అంటూ లక్ష్మణ్ కుమార్ వివిధ అంశాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో , పిసిసి సభ్యులు గిరి నాగభుషణం, గాజంగి నందయ్య, బండ శంకర్, మోయిజోద్దిన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కండ్లపెల్లి దుర్గయ్య, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు సత్యం రెడ్డి, గుండా మధు, మన్సూర్, మసర్థి రమేష్, ధర రమేష్ బాబు, సీనియర్ నాయకులు తాటిపర్తి దేవేందర్ రెడ్డి, జగన్, నిషాంత్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, బుర్ర రాములు, గంగా రెడ్డి, తాజొద్దిన్ పాల్గొన్నారు.