డబల్ బెడ్ రూమ్ లకు నీటి సౌకర్యం కోసం పరిశీలన!

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ !

(J. Surender Kumar)

జగిత్యాల పట్టణ అర్బన్ హౌసింగ్ కాలని, కెసిఆర్ కాలని, నుకపల్లి లో మోడల్ హౌస్ కాలని నీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి శుక్రవారం సందర్శించారు.

అనంతరం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కు నీటి వసతి సౌకర్యాలను పరిశీలించి. ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి త్వరగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు.


పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్,.వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,.యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి,.కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, EE రహమాన్, DE మిలింద్, నాయకులు, తదితరులు వారి వెంట ఉన్నారు.

ఎస్ఆర్ఎస్పీ అధికారులతో సమీక్ష సమావేశం!


జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఎస్ ఆర్ ఎస్పీ నీరు విడుదల చేయాలని ఈనెల 18 నుండి నీరు విడుదల చేస్తామని ఎస్ ఆర్ ఎస్ పి అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. శుక్రవారం తన నివాసంలో ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష సమావేశం. నిర్వహించారు.
ధర్మ సముద్రం, కండ్ల పల్లి చెరువులకు సైతం నీరు విడుదల చేయాలని వారిని కోరారు.
గుట్రాజ్ పల్లి , గుల్లపెట్ లలో చెక్ డ్యాం లను త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు .
మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా బీట్ బజార్ ప్రైమరీ, ఓల్డ్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్,.ఫోర్ట్ హై స్కూల్ ఉర్దూ మీడియం లలో పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఈ సమావేశం లో S E శ్రీనివాస్, E E A H ఖాన్, DE వాజిడ్ అలీ, తదితరులు ఉన్నారు.