ధర్మపురి ఆలయంలో..
( J. Surender Kumar)
ధర్మపురి శ్రీ లక్ష్మీ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు అమలు చేయకుండా, ఆలయ అధికారులు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారనె ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆలయానికి, భక్తజనంకు ఇబ్బందులు తప్పడం లేదు
వివరాలు ఇలా ఉన్నాయి.

ధర్మపురి పట్టణంలో బస్టాండ్ సమీపాన ఆలయానికి చెందిన 8 షటర్లు (దుకాణాలు) ఉన్నాయి. వీటి ద్వారా ఆలయానికి కిరాయి రూపంలో ఆదాయం వస్తుంది. ఇట్టి దుకాణాల వేలం కోసం దేవస్థానంవారు ప్రకటన జారీ చేశారు.
టెండర్ ప్రకటన ..
టెండర్ ప్రకటన ..

దేవాదాయ శాఖ లేఖ సంఖ్య. R.C No. 235/2022, తేది 19/10/2022 న షీల్డ్ టెండర్ కమ్ వేలంప్రకటన జారీ చేశారు. 8 షాపులకు దుకాణం ఒక్కంటి కీ ₹ 1, 00000/- సెక్యూరిటీ డిపాజిట్, డీ. డీ టెండర్ షెడ్యూల్ ధర.₹,2000/-
1/11/2022 నుండి 30/11/2022 టెండర్ల స్వీకరణకు చివరి తేదీగా ప్రకటించారు.
1/11/2022 నుండి 30/11/2022 టెండర్ల స్వీకరణకు చివరి తేదీగా ప్రకటించారు.
టెండర్ ఫైనల్ చేసారు !

టెండర్ నిబంధనల మేరకు, పారదర్శకంగా నవంబర్ 3న ఆలయ అధికారులు ఫైనల్ చేశారు. దుకాణాల సొంతం చేసుకున్న వారి పేర్లు, గతంలో కంటే ఎంత మొత్తంలో కిరాయి పెంచి సొంతం చేసుకున్నారు. వారి కిరాయి కాల పరిమితి. 1/12/2022 నుంచి 30/11/2025 అంటూ పత్రిక ప్రకటన జారీ చేశారు. ఇందులో దుకాణం నెంబర్ 4 ఎవరు దక్కించుకున్నారో, ఎంత కిరాయి ? అనే వివరాలు మాత్రం జారీ చేసిన ప్రకటనలో లేవు.
అమలకు నోచుకోని కమిషనర్ ఆదేశాలు!
ఆలయ పరిధిలో వ్యాపారాలు నిర్వహించే వారి లైసెన్స్ గడువులు, కిరాయిదారులు అద్దె కాలపరిమితి ముగియడానికి తప్పనిసరిగా మూడు నెలలు ముందుగానే. వాటికి టెండర్, వేలం ప్రకటన జారీ చేసి, లీజు ప్రక్రియను ఆలయ అధికారులు పూర్తి చేయాల్సి ఉంది. ఇష్టానుసారంగా దాదాపు రెండు నెలల కొన్ని రోజుల ముందు ప్రకటన జారీ చేశారు.
కమిషనర్ ఉత్తర్వులు ఇలా ఉన్నాయి!

తేది.4/3/2020, న లేఖ D.Dis. No. B1/1927/2020 ద్వారా ఉత్తర్వులలో 12 కాలంలో స్పష్టంగా కచ్చితంగా మూడు నెలల ముందు ప్రక్రియ పూర్తి చేయాల్సింది గా దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ సంతకంతో ఆలయానికి ఆదేశాలు వచ్చాయి. ఈ ఉత్తర్వుల మేరకు దుకాణాలు ( 3 నెలలు ముందు) వేలం ప్రకటన 1/9/2022 న జారీ చేయాలి, ఆలయ అధికారులు మాత్రం నెల రోజుల ఆలస్యంగా 19/10/2022 న ప్రకటన జారీ చేసి కమిషనర్ ఆదేశాలను బేఖతర్ చేశారు అనే ఆరోపణలకు బలం చేకూరింది.
సంవత్సరాలుగా ఇదే నిర్లక్ష్యం!
వేములవాడ, కొండగట్టు, బాసర, గూడెం సత్యనారాయణ స్వామి, లాంటి ప్రముఖ దేవాలయాలు ఎక్కడ అగుపించని పూజా సామాగ్రి అమ్మకాల దుకాణం ధర్మపురి ఆలయ ప్రాంగణంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నది.
భక్తజనంకు పూజా సామాగ్రి అమ్మకాల కోసం టెండర్ ద్వారా వ్యాపారి సొంతం చేసుకున్నాడు. తేదీ 16/12/2019 నుంచి 31/3/2022 వరకు కాల పరిమితికి ₹ 13 లక్ష ల. 84 వేలకు వేలంలో రవి అనే వ్యక్తి కైవసం చేసుకున్నారు.
భక్తజనంకు పూజా సామాగ్రి అమ్మకాల కోసం టెండర్ ద్వారా వ్యాపారి సొంతం చేసుకున్నాడు. తేదీ 16/12/2019 నుంచి 31/3/2022 వరకు కాల పరిమితికి ₹ 13 లక్ష ల. 84 వేలకు వేలంలో రవి అనే వ్యక్తి కైవసం చేసుకున్నారు.

కొబ్బరికాయలు మినహా ,పూజా సామాగ్రి , పిల్లల ఆట బొమ్మలు, భక్తి పాటలు పుస్తకాలు తదితర నూనెలు ,పత్తి వత్తులు వస్తువులు అమ్ముకోవడానికి టెండర్ దారుడికి హక్కు కల్పించారు. అధిక ధరలకు అమ్మ వద్దు, భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించ రాదు, కేటాయించిన స్థలములోనే దుకాణాము ఏర్పాటు చేయాలని వేలం దారుడితో ఆలయ అధికారులు అగ్రిమెంట్ చేయించుకున్నారు. దుకాణం నిర్వాహకుడు మాత్రం అధిక ధరలకు ప్రతి వస్తువు మార్కెట్ లోని ధరలకు రెండింతలుగా భక్తుల కు అమ్మకాలు జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకంగా స్థానిక దైవం లక్ష్మీ నరసింహస్వామి, ఫోటో ఫ్రేములు అమ్మకాల కూడా ఈ నిర్వాహకుడిగా అప్పగించడంతో వివిధ సైజుల ఫోటోలు రెట్టింపు ధరలు పెంచడంతో పాటు అనేక సందర్భాల్లో ఫోటోలు అందుబాటులో లేవంటూ సమాధానం రావడంతో భక్తజనం నిరాశ చెందుతున్నారు. అగ్రిమెంట్ మేరకు (10 +10 ) దాదాపుగా ఉండాల్సిన దుకాణ విస్తీర్ణం, రెండింతలుగా విస్తరించి, రెండు వైపులా అమ్మకాల ప్రదర్శన ఏర్పాటు చేసిన ,భక్తజనం రాకపోకలకు, సేద తీర్చుకోవడానికి ఇబ్బందులు కలిగిస్తున్న ఆ పూజా దుకాణం పై చర్యలు శూన్యం. ( ఏదో మొక్కుబడిగా జరిమానా వసూలు చేస్తూ రికార్డులలో నమోదు చేయడం తప్ప. అధికారులు దుకాణం విస్తీర్ణం మాత్రం తగ్గించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి) అధికారులలో స్పందన కరువైంది అనే ఆరోపణలు ఉన్నాయి. అధిక ధరలు, అగ్రిమెంట్ లో లేని అంశాల, అమ్మకాలు నిత్యం జరుగుతున్న , అధికారుల కామ్ గా ఉంటున్నారు. భక్తజనం వద్ద అధిక ధరలు వసూలు చేస్తున్న , ఆలయ అధికారులకు తెలిసిన తెలియనట్లు ప్రవర్తించడం గమనార్హం.
ధరల బోర్డులు పెట్టాల్సిందే! కమిషనర్ ఉత్తర్వులు.

భక్తుల సౌకర్యార్థం పూజా టికెట్ల వివరాలు, ప్రసాదం, కొబ్బరికాయ, పార్కింగ్ ఫీజు, పూజా సామాగ్రి తదితర ధరలను ( రేట్లు) తెలియపరచు బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్ కార్యాలయం లేఖ సంఖ్య D.Dis.No.B1/1927/2020. తేది. 4/3/2020 న జారీ చేసిన ఉత్తర్వులలో ఈ అంశం 26 కాలంలో స్పష్టంగా ఆదేశాలిస్తూ పేర్కొనబడింది. ఈ మేరకు పూజా టికెట్ల ధరలు, సులబా కాంప్లెక్స్ లో ధరలు, కొబ్బరికాయల కొట్టే స్థలంలో,” ఎవరికి డబ్బులు ఇవ్వవద్దు ” అంటూ బోర్డులు ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు ఈ దుకాణం వద్ద మాత్రం పూజా సామాగ్రి ధరలు, బొమ్మల తదితర వస్తువుల ధరలు తెలిపే బోర్డు మాత్రం ఏర్పాటు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో అధికారులే స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.