ధర్మపురి రూపు రేఖలు మార్చాం 66 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు!

మంత్రి కొప్పుల ఈశ్వర్ !

(J. Surender Kumar)

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మపురి నియోజకవర్గం
రూపు రేఖలు పూర్తిగా మారి పోయాయాని రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
శనివారం ధర్మపురిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. 66 కోట్ల వ్యయంతో ధర్మపురి ఆలయ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
మనబస్తీ, మనబడి పథకం ద్వారా కోటి 65 వేల వ్యయం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి కొప్పుల శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

విజయోత్సవ అనేక మార్పులు తీసుకువచ్చామని.. ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విద్యార్థులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని. డిజిటల్ విద్యా విధానంతో విద్యార్దూల్లో చైతన్యం కల్పిస్తున్నామని తెలిపారు.

అదే విధంగా 30 లక్షల వ్యయంతో నిర్మించిన మేరు సంఘం భవనాన్ని ప్రారంభిచారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ సంగి సత్తేమ్మ, జడ్పిటిసి బత్తిని అరుణ, ఎంపిపి చిట్టి బాబు. డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సునిల్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

నిధులు మంజూరు చేస్తా !


ధర్మపురి పర్యటనలో భాగంగా జైన గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఎస్సీ కుల సంఘ భవనాన్ని పరిశీలించి, మిగులు నిధులు మంజూరి మంత్రి కొప్పుల ఈశ్వర్ సానుకూలంగా స్పందించారు

ముక్కోటి ఏకాదశి మంత్రి దంపతులకు ఆహ్వానం

శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జనవరి 02.వ తేదీన ముక్కోటి వైకుంఠ ఏకాదశి దర్శన మహోత్సవం పురస్కరించుకుని, శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఇందారపు రామయ్య మరియు కమిటీ సభ్యులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులను శనివారం కలిసి, ఆహ్వాన పత్రిక అందించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయం E.O. శ్రీనివాస్ , కమిటీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు