ధర్మపురికి గోదావరి వరదల నుంచి రక్షణ కల్పించండి!

సీఎం కేసీఆర్ కు తీర గ్రామాల ప్రజల విన్నపం!

(J. Surender Kumar)

గోదావరి నది తీరాన గల ధర్మపురి క్షేత్రానికి, పరిసర గ్రామాలకు వరద నివారణ చర్యలు లో భాగంగా కరకట్ట నిర్మించి రక్షణ చర్యలు చేపట్టాలని నదీ తీర గ్రామాల ప్రజలు సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్నారు.

గోదావరి వరదలలో నష్టం ఫైల్ ఫోటో

నది వరదల వల్ల ప్రతిఏటా అపార ఆస్తి నష్టం, పంట నష్టం సంభవిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ వరద నివారణ చర్యలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయకపోవడం బాధాకరమని చర్చ .

లైన్స్ క్లబ్ అన్నదానం వరద బాధితులకు ఫైల్ ఫోటో

వరదల తీవ్రత…

గోదావరి వరదలతో జరిగే అపార నష్టం, వాటి వివరాల గూర్చి చర్చించడానికి ముందు. 1983, సంవత్సరంలో 1995 సంవత్సరంలో ధర్మపురి క్షేత్రంలో రెండు ప్రాంతాలలో లక్షలాది రూపాయలతో వందలాదిమంది వరద బాధితులకు ఇళ్ల నిర్మాణం ( కాలనీ నిర్మాణం) చేపట్టారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఈ విపత్తు నివారణ కోసం ఎలాంటి ఆలోచన చేయలేదు. వరద తీవ్రతను ధర్మపురి క్షేత్రం తో పాటు పరిసర గ్రామంలో అపార నష్టం సంభవించడంతో 1995, అక్టోబర్ 29న. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ధర్మపురికి వచ్చారు. బాధితులను అన్ని విధాల ఆదుకుంటానని ఇచ్చిన.హామీలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.

ప్రతి ఏట ముంపు తప్పడం లేదు!

ధర్మపురి పట్టణంలోకి గోదావరి వరద ఫైల్ ఫోటో

ప్రభుత్వ ఆసుపత్రి ,హరిత వసతి గృహం, టీటీడీ వసతి గృహం, బ్రాహ్మణ సంఘ భవనం, తెలుగు కళాశాల, వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయము, నిత్యాన్న సత్ర భవనం,. శారద మహిళా మండలి, పద్మశాలి సంఘ భవనం, ఆర్ఎంపీపీ ఎంపీ సంఘ భవనం, సంతోషిమాత, దత్తాత్రేయ స్వామి, శ్రీ రామాలయం, సాయిబాబా మందిరాలు, బోయవాడ, గంపలవాడ, స్మశాన వాటిక, తెలుగువాడ, కొన్ని బ్రాహ్మణ వాడ ఇల్లు, మంగళగడ్డ పై తాత్కాలిక వ్యాపార షెడ్లు, రోజుల తరబడి ముంపు బారిన పడక తప్పడం లేదు. తీర గ్రామాల్లో ఇసుక మేటలు,పంట పొలాలు వ్యవసాయ భూములకు కోతలు, ఇల్లు కూలిపోవడం పాక్షికంగా దెబ్బ తినడం, కట్టుబట్టలతో శిబిరాల్లో బాధితుల తలదాచుకోవడం మామూలుగా మారింది. ఓ సంవత్సరంలో అపరా నష్టం ,మరో సంవత్సరం పాక్షిక నష్టం సంభవించడం షరా మామూలే!

ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ పై వరదతో ముప్పు!

నీట మునిగిన సంతోషిమాత ఆలయం ఫైల్ ఫోటో

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం తో బ్యాక్ వాటర్ ధర్మపురి లోని సంతోషిమాత ఆలయం ముంగిట వరకు కొన్ని నెలల పాటు నిలిచి ఉంటుంది. ఎగువ భాగం లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లో నీటిమట్టం 1091. అడుగుల సామర్థ్యం కలిగి ఉంది. దాని ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో వర్షాలు ,వరదలు సంభవించినప్పుడు గైక్వాడ్, బాబ్లీ, నిజాంసాగర్ ప్రాజెక్టులు సామర్థ్యానికి మించిన ప్రమాద స్థాయికి చేరుకున్న దశలో ఆ నీటిని నేరుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వదులుతారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతారు. ధర్మపురి క్షేత్రానికి ఎగువ భాగాన ఎస్సారెస్పీ దిగువ భాగాన పెంబి, కడెం ప్రాజెక్టు సామర్థ్యానికి మించి నిండి ఉండడంతో ఆ నీటిని కూడా ఇదే గోదావరి ప్రవాహం కు వదులుతారు. పరిసర గ్రామాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, చెరువులో నీరు, ఉపనదుల ద్వారా వచ్చే నీటి ప్రవాహం ధర్మపురి క్షేత్రంనికి తాకి అల్లకల్లోలం చేయడంతో పాటు అనేక నిద్ర లేని రాత్రులు, క్షేత్ర వాసులు గడుపుతున్నారు. దీంతోపాటు అపార ఆస్తి నష్టం, తీర గ్రామాల ప్రజల ఆస్తులు,పంట భూములకు నష్టం దశాబ్దాల కాలంగా ఈ తంతు కొనసాగుతున్నది. గోదావరి వరద నివారణ చర్యల కోసం భద్రాచలం క్షేత్రానికి ,కేంద్ర సాంకేతిక బృందం. గత కొన్ని నెలల క్రితం సందర్శించిన విషయం విధితమే. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వరద నివారణ చర్యలు చేపట్టి ధర్మపురి తీరావాసులను, పుణ్యక్షేత్రానికి వరదల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు ముక్తకంఠంతో సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్నారు.