విద్యుత్ దీపాల కాంతిలోఆలయ ప్రాంగణం!
J. Surender Kumar,
నూతన సంవత్సరం 2023 లో రెండవ తేదీ సోమవారం రోజున జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లు నిర్వహణపై శనివారం ధర్మపురిఆలయంలో కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, చాంబర్ లో ఆయన అధ్యక్షతన ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది.

ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఇందారపు రామయ్య, మరియు కమిటీ సభ్యులు, మున్సిపల్ చైర్ పర్సన్, సంగి సత్తెమ్మ, మున్సిపల్ కమిషనర్ రమేష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కోటేశ్వర్, విద్యుత్తు శాఖ A.E మనోహర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కిరణ్, అధికారులతో పాటు అర్చకులు, నంబి శ్రీనివాసాచారి, నేరెళ్ల శ్రీనివాసచార్యులు, వేద పండితుడు బొజ్జ రమేష్ శర్మ,తోపాటు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గునిశెట్టి రవీందర్, ,సంగెం సురేష్ , అక్కనపల్లి సురేందర్ , వేముల నరేష్ , ఇనగంటి రమ వెంకటేశ్వరరావు , ,గందె పద్మ శ్రీనివాస్ ,చుక్క రవి పల్లెర్ల సురేందర్ , గుంపుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు బందోబస్తు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా,. తదితర అంశాలపై చర్చించారు. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కోసం తరలివచ్చే మార్గాలను వారు పర్యవేక్షించారు.
యమధర్మరాజుకు పూజలు ఎలా?

సోమవారం ముక్కోటి ఏకాదశి రోజున * భరణి నక్షత్ర * నేపథ్యంలో యమధర్మరాజుకు పూజాది కార్యక్రమాలు అభిషేకాలు, ఆయుష్ హోమం, ఎలా నిర్వహిస్తారొ ? అని భక్తజనం చర్చించుకుంటున్నారు.. ప్రతి భరణి నక్షత్రం రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. అయితే వైకుంఠ ద్వారం నుంచి, వెంకటేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముక్కోటి రోజున ఆశీస్సులు గావించడానికి అంగరంగ వైభవంగా వేదికను ఏర్పాటు చేశారు. యమధర్మరాజు ఆలయానికి అభిముఖంగా ఈ క్యూ లైన్ దారి ఉంటుంది..ముక్కోటి దర్శనానంతరం యమధర్మరాజు దర్శించుకోవడానికి ఆలయ అధికారులు ఏర్పాటు చేసి ఉన్నారో అనే అంశంలో.స్పష్టత లేదు.. స్వామివారికి ఆయుష్ హోమం, అభిషేకాలు, ప్రతి భరణి నక్షత్రం రోజునఅక్కడే నిర్వహిస్తారు. ప్రస్తుతానికి ముక్కోటి రోజున ఆ ప్రాంతంలో అవకాశం ఉండదు, వేలాది మంది భక్తుల రాక ఆ మార్గంగానే కొనసాగుతుంది. అర్చకులు ,వేద పండితులు, అధికారులు భక్తుల మనోభావాలకు అనుగుణంగా చర్యలు చేపట్టవచ్చు. కొనసాగుతున్న యమధర్మరాజు సాంప్రదాయ పూజది కార్యక్రమాలు ఏదో విధంగా వేద పండితులు అర్చకులు నిర్వహిస్తారనే నమ్మకం భక్తజనంలో ఉంది.

విద్యుత్ దీపాల కాంతితో వెలిగిపోతున్న ఆలయము ప్రాంగణం!

ముక్కోటి ఉత్సవాల నేపథ్యంలో ఆలయ శిఖరాలు, గోపురాల తోపాటు ఇసుక స్తంభం, రామలింగేశ్వర స్వామి ఆలయం ముఖ ద్వారం తదితర ప్రదేశాల్లో అమర్చిన విద్యుత్తు దీపాలతో ఆలయ ప్రాంగణాలు, క్షేత్ర పరిసరాలు వెలిగిపోతున్నాయి.

ఉత్తర ద్వారం గుండా స్వామివారలు ఆసీనులైన వేదిక వరకు నభూతో, నా భవిష్యత్తు తరహాలో పువ్వులు, రంగవల్లులతో అంగరంగ వైభవంగా అలంకరణ చర్యలు చేపడుతున్నారు.

పూల కోసం ఒక లక్షా 50 వేల విరాళం!
దుబాయిలో ₹ 30 కోట్ల లక్కీ విజేత ఓగుల అజయ్, (బీర్పూర్ మండలం తుంగూరు గ్రామ నివాసి). ముక్కోటి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి పూల అలంకరణ కోసం తన సోదరుడి ద్వారా స్వామివారి ఆలయానికి ₹ 1.50 లక్షలు రెండు రోజుల క్రితం అందించారు.
