ధర్మపురి నరసింహుడి హుండీ ఆదాయం ₹ 48 లక్షలు !


భక్తజనం రోజు హుండీలో ₹51, వేలు వేశారు ?
మొత్తం 94 రోజులు హుండీ ఆదాయం ,!.


(J. Surender Kumar)

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హుండీ ఆదాయం ₹48,44,963 రూపాయలు వచ్చాయి. శుక్రవారం దేవాలయ ప్రాంగణంలో కట్టుదిట్టమైన నిఘా నీడలో హుండీ లెక్కింపు జరిగింది.

ఈ ఆదాయం మొత్తం 94 రోజులుగా అధికారులు వివరించారు. (7-9-2022 నుంచి 9-12-2022). హుండీలో 72 గ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల 280 గ్రాముల మిశ్రమ వెండి, 55 విదేశీ కరెన్సీ వచ్చాయని కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ తెలిపారు. దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు ఉండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు