ధర్మపురి శ్రీ గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం లో!

అంగరంగ వైభవంగా ఆరవ వార్షికోత్సవ ఉత్సవాలు!

(J.Surender Kumar)

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లోని శ్రీ గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఆరవ వార్షికోత్సవ ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి.


ఉదయం క్షేత్రంలో నిర్వాహకులు, సభ్యులు ,మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో నగర సంకీర్తన నిర్వహించారు.


నిత్య అన్నదాన సత్ర భవనంలో వేద పండితులు రుద్రాభిషేక పూజాది కార్యక్రమాలు జరిగాయి. స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.


దుర్ముఖి నామ సంవత్సరం కార్తీక బహుళ పంచమి రోజున (2017)లో పదవి విరమణ చేసిన బ్రాహ్మణ ఉద్యోగులు, యువకులు సమిష్టిగా సొంత పెన్షన్ డబ్బులతో అన్నదాన నిర్వహణ నిధిని ఏర్పాటు చేశారు.

వారే వంతుల వారిగా నిత్యం ధర్మపురి క్షేత్రానికి వచ్చే బ్రాహ్మణ యాత్రకులకు, ఉదయం భోజనం ,సాయంత్రం పలహార, సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు. గత కొన్ని నెలల క్రితం నిత్యాన్న దాన సత్రం కు లక్షలాది రూపాయల నిధులతో సొంత భవనాన్ని నిర్మించారు.

బ్రాహ్మణ కుటుంబ సభ్యులు, ఉద్యోగులు ఇచ్చిన విరాళాలతో. భవన నిర్మాణాన్ని చేపట్టారు. గోదావరి నది తీరంలో దత్తాత్రేయ ,సాయిబాబా, శ్రీరామాలయం సమీపంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్ర భవనం ఉంది.