డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్!
(J. Surender Kumar)
ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు తో తెలంగాణ వచ్చింది అని చెప్పే ముఖ్యమంత్రి యాదాద్రి తరహలో ధర్మపురి పుణ్య క్షేత్రన్నీ ఎందుకు అభివృద్ధి చెయ్యడం లేదు. అని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
ధర్మపురి పట్టణంలో గురువారం ఆయన నివాస గృహంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ధర్మపురి లో పుష్కరాలు ఆంధ్రలో జరిగే పుష్కరలు తలదన్నే విధంగా నిర్వహిస్తం అని చెప్పి పుష్కరాల సందర్భంగా చేసిన పనులకు వేములవాడ ఆలయ నిధులు నుండి అప్పుగా తీసుకువచ్చి ఖర్చు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ 2014 నుండి ఇప్పటి వరకు అధికారంలో కొనసాగుతున్నరు. యాదాద్రి త, వేములవాడ తరహా అభివృద్ధి ధర్మపురి లో ఎందుకు జరగడం లేదు ధర్మపురి కి డివైడర్స్, రోడ్ల వెడల్పు పనులు తప్ప ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసేంత చొరవ చూపించడం లేదు అని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ పార్టీ మీటింగ్ కి బిసి హాస్టళ్లలో చదువుకొనే విద్యార్థులను తీసుకువచ్చి వారికి పార్టీ టిషర్ట్ వేయించి వాలంటర్ గా వారితోనే పని చేయించారు.. దీనికి ఆ సంక్షేమ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి వస్తున్నారు ధర్మపురిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తారని, దళితబందు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అర్హులైన ప్రతి ఒక్కరికి అందచేసేవిదంగా ప్రకటన చేస్తారని, ఎస్సీ కార్పొరేషన్ పెండింగ్ లోన్లు విడుదల చేసే విదంగా ప్రకటన ఉంటుందని ఉహించాం.. అలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమని లక్ష్మణ్ అన్నారు.
నైట్ కాలేజీ లో అరకొర సదుపాయాలతో విద్యార్థులు సంఖ్య తగ్గిపోయింది,బోధన సిబ్బంది లేరు ఒక్క ప్రిన్సిపాల్ ని ఇంఛార్జి గా ఉంచి అతనికి జీతం ఇప్పించలేని స్థితిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కి వస్తే మన ధర్మపురి ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటన చేయించలేని స్థితిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారని ఆరోపించారు.
ధర్మపురి లో ఒక ఐటీఐ కళశాల లేదు,పాలిటెక్నిక్ కళాశాల లేదు, మహిళలు ప్రత్యేక డిగ్రీ కళాశాల లేదు. అంటూ తదితర ఆరోపణలు చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సంఘనపట్ల దినేష్, వేముల రాజు, సింహరాజు ప్రసాద్, శ్రీపతి సత్యనారాయణ,రఫీ, రాందేని మొగిలి అప్పని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.