ఎన్నికల సంఘం తీరు అభినందనీయం!
(J. Surender Kumar)
గుజరాత్ లో మొదటి విడత జరుగుతున్న ఎన్నికల్లో గురువారం దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక ఓటర్ కోసం ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసింది.
దట్టమైన గిర్ అటవీ ప్రాంతంలోని పోలింగ్ బూత్ నుంచి ఒక్క ఓటరు ఓటు వేశారు. దీంతో ఆ బూత్ లో 100% ఓటింగ్ నమోదు అయినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.

గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతం ‘ఉనా ‘ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగం, రాష్ట్రంలోని 88 ఇతర స్థానాలతో పాటు గురువారం ఎన్నికలు జరిగాయి.
ఎన్నికల సంఘం (EC) గిర్ అటవీ ప్రాంతంలో ఉన్న బనేజ్ గ్రామంలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసింది, తద్వారా అక్కడ ఉన్న ఏకైక ఓటరు మహంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. పదిమంది ఎన్నికల సిబ్బంది 25 కిలోమీటర్లు దట్టమైన అడవిలో కాలినడక, భానేశ్వర్ మహాదేవ్ ఆలయం పక్కన అటవీశాఖ కార్యాలయంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.

అక్కడ సెల్ ఫోన్ లో పనిచేయకపోవడంతో అటవీశాఖకు చెందిన వైర్లెస్ పరికరాలతో అనుక్షణం ఎన్నికల కమిషన్తో సిబ్బంది చర్చలు కొనసాగించారు. ఓటర్ మొహంతో తాను తన గ్రామం విడిచి బయటకు వచ్చి ఓటు వేయమని మొండికేయడంతో ఎన్నికల సంఘమే ఆయన కోసం పోలింగ్ అటవీ ప్రాంతంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేసింది.. దీంతోపాటు తోపాటు అటవీ గిరిజన ప్రాంతంలో మరో ఏడు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. పార్లమెంట్, జిల్లా పరిషత్ ఎన్నికలలో ఇలానే ఏర్పాటుభారత ప్రజాస్వామ్యం వ్యవస్థలో ఒకే ఒక ఓటు కోసం ఎన్నికల కమిషన్ చేసిన కృషి అభినందనీయం

మొదటి దశ పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియడంతో గురువారం 57% పైగా ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గాను 788 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమై 14,382 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.