(J. Surender Kumar)
ధర్మపురి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను,త్యాగాలను గుర్తుచేసుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎడ్ల చిట్టిబాబు ,జడ్పీటీసీ బత్తిని అరుణ ,వైస్ ఎంపిపి గడ్డం మహిపాల్ రెడ్డి ,ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్ ,MEO భూమయ్య ,రామయ్యపల్లి సర్పంచ్ మెడపట్ల దుబ్బయ్య , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో..

ధర్మపురి డా బీ ఆర్ అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో , అంబేద్కర్ 66వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ మండల అధ్యక్షుడు తరాల కార్తిక్, మునిసిపల్ ఛైర్మన్ సంగి సత్తమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు బత్తిని అరుణ, mrps రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలుముల లక్ష్మణ్, అంబేద్కర్ సంఘ ఉపాధ్యక్షుడు అవునూరి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, మాల మహానాడు అధ్యక్షుడు, ఆనంతుల లక్ష్మణ్, సర్పంచ్ మెడపట్ల దుబ్బయ్య, ఎంపీటీసీ కాళ్ళ సత్యం, గొడిసెల రవి, శ్రీనివాస్, .విజయ్, గంగాధర్, అంజలి, .గంగపొసమ్మ, ప్రశాంత్ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు .
ధర్మపురి భార్ అసోసియేషన్…

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తిరమందస్ సత్యనారాయణ , అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి చేసిన సేవలను,త్యాగాలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గడ్డం లింగారెడ్డి, గడ్డం సత్యనారాయణ రెడ్డి , మామిడాల శ్రీకాంత్, రౌతు రాజేష్ , అలుక వినోద్, బందెల రమేష్, రామడుగు రాజేష్, సాంబరాజుల కార్తిక్, జాజాల రమేష్ , బత్తిని ఇంద్రకరణ్, చీకటి సతీష్ , శరత్ పాల్గొన్నారు
జైన గ్రామంలో..

జైనాలో అంబెడ్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు కట్ట లచయ్య ఆధ్వర్యములో, బాబాసాహెబ్ అంబెడ్కర్ 66 వ వర్ధంతి జరిగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ఆత్మకు శాంతి కలగని 2 ని” మౌనం పాటించడము జరిగింది.
ఈ కార్యక్రమములో జిల్లా MRPS కార్యదర్చి కట్ట భువనేశ్వర్, మాజీ సర్పంచ్ కుంట సుధాకర్, 2వ వార్డు సభ్యులు సంబేట తిరుపతి, కోఆప్షన్ మెంబెర్ సుడబోయిని ఆనందం, దుర్గం బుచ్చన్న, బీజేపీ మండల అధ్యక్షులు సంగపు గంగారాం, TRS గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్, గల్ఫ్ సమితి అధ్యక్షులు సుంకి మధు, శంకర్ ,సుధాకర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లింపు!

ధర్మపురి లోని గాయత్రి బ్యాంకు ఖాతా కలిగి ఉన్న తిప్పర్తి లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఖాతా ఇన్సూరెన్స్ డబ్బులు లక్ష రూపాయలు ఖాతాదారుడి భార్య శ్రీదేవికి మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మ, అందించారు. బ్యాంకు మేనేజర్ ఒజ్జల మోహన్, ఫీల్డ్ ఆఫీసర్ లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సహాయం!

ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భూషణ్ అనే వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ఆయనకు లైన్స్ క్లబ్ సభ్యులుమంగళవారం ఆర్థిక సాయం అందించారు. అధ్యక్షుడు డాక్టర్ ఐ రామకృష్ణ. తదితర లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు

గురువారం రోజున బుగ్గరాం మండలం మద్దునురు గ్రామానికి చెందిన బండారి లక్ష్మన్ బండారి సుమన్ ధర్మపురి కోర్టు ఆవరణలో న్యాయవాది గూడ జితేందర్ రెడ్డి ని అసభ్యకరమైన పదజాలంతో దూషించినందుకు అదే రోజు ధర్మపురి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. వారిపై పోలీసులు కేస్ నమోదు చేశారు. శుక్రవారం రోజున ధర్మపురి కోర్టులో బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించారు, వారు మరల బయట మళ్ళీ న్యాయవాదుల మనోభావాలు దెబ్బతీసేల మాట్లాడడాన్ని నిరసిస్తూ మంగళవారం నుండి శుక్రవారం వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు తిరమందస్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని, మరియు సంఘటనకు కారకులైన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని, న్యాయవాదులపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే సహించేది లేదని అన్నారు . ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గడ్డం లింగారెడ్డి , గడ్డం సత్యనారాయణ రెడ్డి , మామిడాల శ్రీకాంత్, రౌతు రాజేష్ అలుక వినోద్, బందెల రమేష్ రామడుగు రాజేష్ సాంబరాజుల కార్తిక్ జాజాల రమేష్ బత్తిని ఇంద్రకరణ్ చీకటి సతీష్, శరత్ పాల్గొన్నారు