(J. Surender Kumar)
ఉన్న ఊరిలో ఉపాధి కరువై తల్లి ,తమ్ముడు, చెల్లెలి పోషణ కోసం దుబాయ్ బాట పట్టి అక్కడ లాటరీలో (పజిలింగ్) లో. ₹ 30 కోట్ల. బహుమతి గెలుచుకున్న విజేత అజయ్ లో మరో కోణం దాగి ఉన్న విషయం అతి కొద్ది మందికే తెలుసు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ కూడా, తాను చదువుకున్న తుంగూర్ గ్రామ పాఠశాలకు తన స్థాయికి మించి అందించిన చేయూత వెలుగు చూడలేదు. లాటరీ విజేతగా అజయ్ పేరు, వివరాలు ప్రచార మాధ్యమాల్లో చోటు చేసుకున్న విషయ తెలిసిందే.

నూతనంగా నిర్మించుకున్న ఇంటికి సిమెంటు పొరలు చేయించుకోవడానికి, నిర్మాణం పూర్తి చేయడానికి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పూర్తి చేయలేదు.

కానీ తన గ్రామ పాఠశాలకు పూల కుండీలు, స్కౌట్ విద్యార్థులకు బ్యాండ్ పరికరాలు, పాఠశాలకు సౌండ్ సిస్టం ను నాడు విరాళంగా అందించి తన ఉదాహరతను చాటుకున్న అంశం వెలుగు చూడలేదు.

ధర్మపురిలో అజయ్ పేరు. టాక్ ఆఫ్ ది టౌన్ !
అరే, రాజు కొడుకా , లాటరీ విజేత అజయ్ అంటూ, ధర్మపురి పట్టణంలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. .అజయ్ తండ్రి ధర్మపురి బస్టాండ్ లో పాన్ డబ్బా నిర్వహిస్తూ, కొంతకాలం పేపర్ ఏజెంట్ గా, చింతామణి చెరువు కట్ట కింద చిన్నపాటి టీ కొట్టు ను కొంతకాలం నిర్వహించాడు.

నేపథ్యంలో రాజుకు అనేక మందితో స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి.. అనారోగ్యంతో రాజు మృతి చెందడంతో ఆ కుటుంబం తుంగూరు కు పోయారు.