కొబ్బరి ముక్కల,వస్త్రాలు, తలనీలాలు!
ధర్మపురి ఆలయ పరిధిలో..
పూజా సామాగ్రి దుకాణం అవుట్
* ఉప్పు* ఎఫెక్ట్...
(J. Surender Kumar)
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు ఎట్టకేలకు వేలం ప్రకటన జారీ చేశారు. ‘ఆలయ వేలం ప్రకటన జారీ జాప్యం ఎందుకు?’ శీర్షికతో ఈనెల 10న ఉప్పు ప్రచురించిన వార్త కథనంకు స్పందించిన అధికారులు వేలం ప్రకటన జారీ చేశారు.

వేలం. ప్రకటన.R.C.No.246/2022, 12/12/2022 తేదీతో బుధవారం ప్రకటన జారీ కాబడింది. ఇందులో ఆలయ ప్రాంగణంలో పూజా సామాగ్రి అమ్మకాలు కొనసాగించే దుకాణం వేలం పేర్కొనలేదు. కొబ్బరి ముక్కలు, వస్త్రాలు తలనీలాలు, మాత్రమే పేర్కొన్నారు. టెండర్లు సమర్పించడానికి చివరి తేదీ ఈ నెల 21 గా పేర్కొన్నారు

292 రోజులు ఉచితంగానే …
తమకు covid-19 లాక్ డౌన్ వల్ల వ్యాపారాలు నిర్వహించలేక నష్టపోయాం అంటూ దాదాపు 31 మంది హైకోర్టును ఆశ్రయించారు.. మా వ్యాపారాలు, లీజ్ కాల పరిమితి ముగిసిన తాము నిర్వహించే వ్యాపారాలకు వేలం ప్రకటన జారీ చేయవద్దని సారాంశం.
లీజు కాల పరిమితి ముగిసిన.రోజు నుంచి 292 రోజులపాటు ఆలయానికి ఎలాంటి కిరాయి డబ్బులు చెల్లించకుండా లీజ దారులకు , ఆయా ఆలయాల కార్యనిర్వాహణాధికారులకు ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు
ఈ నేపథ్యంలో ధర్మపురి ఆలయంలో కొబ్బరి ముక్కల సేకరణ లీజు కాలపరిమితి. 1/4/2020 నుంచి. 31/3/ 2022 నాటికి ముగిసింది. ఈ కాల పరిమితికి లీజు దారుడు ₹ 17.50 లక్షలు ఆలయానికి చెల్లించాలి.

కోవిడ్ కారణంగా అదనంగా. 292 రోజులు పాటు ఎలాంటి రుసుము చెల్లించకుండా కొబ్బరి ముక్కల సేకరణకు. అనుమతించారు. ఇదే తరహాలో ఆలయ ప్రాంగణంలో పూజా సామాగ్రి విక్రయించే కిరాయిదారుడు తేది.16/12/2019 నుంచి. 31/3/2022 వరకు ఆలయానికి ₹.13.84 లక్షలు. కిరాయి చెల్లించాలి. Covid -19 నేపథ్యంలో ఈ వ్యాపారికి సైతం 292 రోజులు మినహాయింపు లభించింది.
దాదాపు 45 రోజుల కాల పరిమితి మాత్రమే మిగిలి ఉంది. కమిషనర్ ఆదేశాల మేరకు మూడు నెలలు ముందుగానే. వేలం ప్రకటన జారీ చేసి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే వేలం ప్రకటన జాప్యంపై వార్త ప్రచురితమైంది.