Flash..Flash..
చైనా లో విజృంభిస్తున్న క‌రోనా వైర‌స్ !

(J. Surender Kumar)

చైనాతో పాటు మ‌రికొన్ని దేశాలు క‌రోనా గుప్పిట ఉన్నాయి. ఇత‌ర దేశాల్లో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు పెరుగుతుండ‌డంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్ర‌మ‌త్తం చేసింది. కొత్త వేరియెంట్ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని రాష్ట్రాల‌ను హెచ్చ‌రించింది. అంతేకాదు పాజిటివ్ కేసుల న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్నింగ్‌కు పంపాల‌ని కేంద్రం తెలిపింది. జ‌పాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ దేశాల్లో నిత్యం వేల‌ల్లో కేసులు న‌మోదవుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌ను జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆదేశించింది.
రెండో వేవ్ త‌ర్వాత మ‌ళ్లీ కొత్త కేసులు రావ‌డంతో చైనా జీరో కొవిడ్ పాల‌సీని ప‌క‌డ్బందీగా అమ‌లు చేసింది. అయితే, ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో జీరో కోవిడ్ పాల‌సీని స‌డ‌లించిందిసింది. ఆ త‌ర్వాత క‌రోనా కేసులు భారీగా న‌మోద‌య్యాయి. దాంతో అక్క‌డి ఆస్ప‌త్రులు క‌రోనా పేషెంట్ల‌తో నిండిపోతున్నాయి. క‌రోనా సోకిన‌వాళ్ల‌తో కిక్కిరిసిన చైనా ఆస్ప‌త్ర‌లు ఫొటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 3 నెలల్లోనే చైనాలోని 60 శాతం మంది క‌రోనా బారిన ప‌డ్డారు. జ‌న‌వ‌రి నుంచి ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు రెండో వేవ్, ఫిబ్ర‌వ‌రి చివ‌రి నుంచి మార్చి 15 వ‌ర‌కు మూడో వేవ్ ప్రారంభం అవుతుంద‌ని వైద్యులు చెప్తున్నారు.