Flash..Flash.. E.D కార్యాలయంలో స్పెషల్ డైరెక్టర్ ల నియామకం!

( J Surender Kumar).

దేశంలో, ప్రస్తుతం రాష్ట్రలలో కొనసాగుతున్న సిబిఐ, ఈడి దాడులు, కేసుల నమోదు తాత్కాలిక ఆస్తుల జప్తు, తదితర ఉదంతాల నేపథ్యంలో ఈడీ కేంద్ర కార్యాలయంలో ముగ్గురు స్పెషల్ డైరెక్టర్లను ప్రభుత్వం మంగళవారం నియమించింది. నియామకం రోజు నుంచి వారు స్పెషల్ డైరెక్టర్ హోదా విధులలో కొనసాగున్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో విధుల్లో కొనసాగుతున్న ముగ్గురు సీనియర్ అధికారులను స్పెషల్ డైరెక్టర్లుగా వారికి పదోన్నతులు కల్పించారు.
కొత్తగా నియమించబడిన ప్రత్యేక డైరెక్టర్లు;
శ్రీమతి సోనియా నారంగ్ IPS:2002:KN  ఒక సంవత్సరం పాటు,
మోనికా శర్మ, IRS IT:2003 ఒక సంవత్సరం పాటు.
సత్యబ్రత కుమార్ IRS C&CE:2004  27-10- 2026. వరకు. ముగ్గురు అధికారులు ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో  అదనపు డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు  .