ఘనంగా పెన్షనర్స్ దినోత్సవం !


( J.Surender Kumar)


జాతీయ పెన్షనర్స దినోత్సవమును  ధర్మపురి పట్టణంలోని కర్నె అక్కపెల్ల కళ్ళాణ మండపం లో. శనివారం ఘనంగా జాతీయ పెన్షన్ దినోత్సవం జరిగింది. ఈ సమావేశం కు  మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి సంగి సత్తెమ్మ , వైస్ చైర్మెన్  ఇందారపు రామన్న  మఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
కొరిడె విశ్వనాథ శర్మ TGREA అధ్యక్షతన జరిగింది
.


ధర్మపురి యునిట్ కు సంబంధించిన ” సీనియర్ పెన్షనర్స’
సంగనభట్ల శ్యామ్ సుందర్ ,  కందాళై అంబరీషాచార్య ,  పానుగంటి దత్తాత్రి , కాకెరి శంకర శర్మ, శ్రీ గుండి రామనాథం ,  గౌసంబేగం  శ్రీమతి సత్తెమ్మ శాలువాలతో సన్మానించారు.
ముఖ్య అతిథులైన శ్రీమతి సత్తెమ్మ , ఇందవరపు రామయ్య  అధ్యక్షుడు , కార్యదర్శి బృందం శాలువాలతో ఘనంగా సన్మానించారు
పానుగంటి దత్తాత్రి ,పలువురు పెన్షనర్ల సమస్యలు  వాటి పరిష్కార కు ప్రభుత్వం సహకరించవలసినదిగా వివరించారు-
కార్యదర్శి ఇందారపు బండయ్య అతిథులను స్వాగతించారు..


జీల్లా బాధ్యులు  అలవాల దత్తాత్రి  పెన్షనర్ల సమస్య – వాటి పరిష్కారానికి తీసుకునే చర్యల గురించి ప్రస్తావించారు. పెన్షనర్లకు “లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ” గూర్చి వివరించారు
అతిధులు ప్రసంగిస్తూ, ధర్మపురి యానిట్ కు శాశ్వత స్థల- భవననిర్మాణం ,గూర్చి ప్రస్తావించారు.  యూనిట్ కార్యదర్శి శ్రీ ఇందవరపు బండయ్య గారు  నివేదిక సమర్పించినారు.

ఈ కార్యక్రమంలో  మధ్వాచార్య రాంకిషన్ , డా. కొరిడె దత్తాత్రి,   కాకెరి దత్తాత్రి ,సంగనభట్ల రాంకిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.