(J. Surender Kumar)
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం (TSTWTU) రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా పెండ్యాల విజయ శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శనివారం 10/12/2022 రోజున అర్ధరాత్రి వరకు నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట గిరిజన గురుకుల కళాశాలలో, TSTWTU రాష్ట్ర కార్య వర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లా లకు చెందిన సంఘ.ప్రతినిధుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గంలో రాష్త్ర కార్యనిర్వాహక .కార్యదర్శిగా పెండ్యాల విజయ శేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గతంలో ఆదిలాబాద్ జిల్లా శాఖలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా. ఆ సంఘ రాష్ట్రం ఉపాధ్యక్షుడిగా పర్యాయములు పనిచేసిన అనుభవం నేపథ్యంలో విజయ శేఖర్ ను సంఘ నాయకులు ఎన్నుకున్నారు.
విజయ శేఖర్ ఎన్నిక పట్ల ఆదిలాబాద్ జిల్లా బాద్యులు మడావి లక్ష్మన్, చవాన్ నెహ్రూ, జాదవ్ శివాజి, టేకమ్ గోవింద్ రావ్, .మడావి శ్రీనివాస్, S. సురేందర్, ఉదయ్ కుమార్ రెడ్ది, యాసీన్ షరీఫ్ తదితరులు హర్షo వ్యక్తo చేశారు.