గ్రామస్తులు కలిసికట్టుగా తిరుపతి క్షేత్రానికి!

గ్రామానికి కాపలాగా సర్పంచ్, కానిస్టేబుల్స్!

(J.Surender Kumar)

కలిసికట్టుగా కుల సంఘాల వనభోజనాలు, పోచమ్మ బోనాలు జరుపుకోవడం తెలిసిందే. కొన్ని గ్రామాల్లో ప్రజలు కలిసికట్టుగా ఉత్సవాలు జరుపుకుంటున్న విషయం అందరికీ తెలుసు. ఆ గ్రామ ఆచార సాంప్రదాయాల మేరకు కలిసికట్టుగా గ్రామస్తులంతా నాలుగు సంవత్సరాలకు ఒకసారి తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లి దర్శించుకోవడం అనాదిగా కొనసాగుతున్న తంతు. గ్రామస్తులు తిరుపతి క్షేత్రం నుంచి గ్రామానికి చేరుకునే వరకు ఆ గ్రామ రక్షణ బాధ్యతలు సర్పంచ్ చేపడుతారు.. రాత్రి పగలు ఇద్దరు కానిస్టేబుళ్లు, సర్పంచ్, గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ, గ్రామస్తుల ఆస్తి ,పాస్తులు ఇళ్లల్లో చోరీలు జరగకుండా, పశువుల సంరక్షణ చర్యలు, సైతం సర్పంచ్ పర్యవేక్షిస్తారు.

గస్తీ చేస్తున్న సర్పంచ్ పోలీసులు

వివరాల్లోకి వెళితే!

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా, బోచంపల్లి పట్టణ సమీపంలో వసంతపురం గ్రామం ఉంది. ఆ గ్రామంలో 45 నివాస గృహాలున్నాయి. ఆ గ్రామస్తులు కలిసికట్టుగా 4 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరూ ఆ ఊరి ఆచారం ప్రకారం, తిరుపతి ఆలయానికి వెళ్తుంటారు.  ఈ నేపథ్యంలో ఈనెల 10న రాత్రి వసంతపురం గ్రామస్తులంతా తిరుపతి కి వెళ్లారు.
గ్రామంలో కొద్దిమంది వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే గ్రామంలో ఉన్నారు. గ్రామస్తులందరూ వెళ్లిపోవడంతో గ్రామం నిర్మానుష్యమైంది. ఈ సమాచారం బోచంపల్లి పట్టణ పోలీస్ కమిషనర్ ప్రభావతి కి తెలియడంతో గ్రామ భద్రత కోసం ఇద్దరు పోలీసులను అక్కడిక నియమించారు. 

అదేవిధంగా పంచాయతీ సర్పంచ్ ఎస్ రంగనాథన్ రాత్రి పగలు గ్రామాన్ని సందర్శిస్తూ భద్రత కల్పిస్తున్నారు. ఊరు మొత్తం ఖాళీ చేసి తిరుపతి క్షేత్రానికి వెళ్లిన ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయంతో పాటు సర్పంచ్ పోలీసులను అభినందిస్తున్నారు.