ఆసుపత్రులలో దోబీ పని రజకులకె ఇవ్వాలి

మోడ్రన్ దోబీ ఘాట్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలి!

ఎం ఎల్ సి బసవరాజు సారయ్య కి వినతిపత్రం !

J. Surender Kumar,

జగిత్యాల పట్టణంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో దోబీ పనికి స్థానిక రజకులకే అవకాశం కల్పించాలని, మోడ్రన్ దోబీ ఘాట్లల నిర్మాణానికి నిధులు మంజూరి చేయటానికి చొరవ చూపాలని వరంగల్ ఎం ఎల్ సి బసవరాజు సారయ్య కు జగిత్యాల పట్టణ రజక సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ మేరకు రజక సంఘం నాయకులు మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోని మాత శిశు ఆసుపత్రి లోని, దోబీ పనికి స్థానిక రజకులకు మాత్రమే అవకాశం కల్పించాలని కోరామని తెలిపారు. మోడ్రన్ దోబీ ఘాట్ల నిర్మాణాకి నిధుల మంజూరికి చొరవ చూపాలని కోరగా సానుకూలంగా స్పందించిన ఎం ఎల్ సి, జగిత్యాల ఎం ఎల్ ఎ సంజయ్ కుమార్ తో మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ సందర్బంగా ఎం ఎల్ సి ని రజక సంఘం నాయకులు శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమం లో రజక సంఘం అధ్యక్షులు పెద్దింటి రాజు, ఉపాధ్యక్షులు మరిపెల్లి లక్ష్మి నారాయణ, కార్యదర్శి మరిపెల్లి శ్రీనివాస్, కోశాధికారి గొల్లపెల్లి నాగరాజు, సంఘ పెద్దమనుషులు, తదితరులు పాల్గొన్నారు.