జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (E.D)
(J.Surender Kumar)
జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఐఏఎస్ అధికారిని పూజా సింఘాల్‌కు చెందిన ₹ 82.77 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది.
ఖుంటి జిల్లా డిప్యూటీ కమిషనర్ గా ఫిబ్రవరి, 2009 నుంచి జూలై 19, 2010 వరకు ఆమె కొనసాగారు.
MNREGA ( ఉపాధి హామీ పథకం) పనులు బిల్లులు తదితర. చెల్లింపులలో కమీషన్ రూపంలో పూజా సింఘాల్, ఆమె బంధువులకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలలో పెద్ద మొత్తంలో నగదు జమ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పూజా సింఘాల్ తన అధికారిక పదవిని దుర్వినియోగం చేయడం ద్వారా ఆమె సంపాదించిన కొట్లాది రూపాయలు నిధులతో ఆమె స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు ఈడి దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో
‘పల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’, ‘పల్స్ డయాగ్నోస్టిక్ అండ్ ఇమాజినింగ్ సెంటర్’ రాంచీలో ఉన్న రెండు చోట్ల వ్యవసాయ, వాణిజ్య భూములను అధికారులు గుర్తించి స్వాధీన పంచుకున్నారు.
జార్ఖండ్ పోలీసులు, విజిలెన్స్ బ్యూరో, నమోదు చేసిన అనేక ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఇడి మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది.
పూజా సింఘాల్‌ను మే 11, 2022న E. D అరెస్టు చేసింది. జూలై 5, 2022న ఆమె పై ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలైంది. పై అవినీతి వ్యవహారానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికే PMLA సెక్షన్ 66 (2) కింద జార్ఖండ్ ప్రభుత్వంతో సంయుక్తంగా పూజా సింఘాల్ తదితరులపై అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు తీసుకుంది
E.D దర్యాప్తులో కేవలం MNREGA నిధుల దుర్వినియోగం అంశం పై విచారణ చేపట్టగా, పూజా సింఘాల్ యొక్క ఇతర అవినీతి, అక్రమాల ద్వారా కోట్లాది రూపాయల నిధులు స్వహచేసి, మూలధనం పెట్టుబడిగా పెట్టి అనేక వ్యాపారాలలో భాగస్వామ్యం అయినట్టు విచారణ వెలుగు చూసింది.
అవినీతి కేసులో పూజా సింఘాల్‌తో, సహా అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో మూడు ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటిపై ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు విచారణ జరుగుతున్నది.