దాదాపు 50 మంది అధికారులు ఆ గ్రామస్తులే.
(J.Surender Kumar)
ఇంటర్నెట్ సౌకర్యం లేదు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు లేవు. జాతీయస్థాయిలో అత్యున్నత కఠిన తరమైన. పోటీ పరీక్షలలో ఇక్కడి యువత విజయ కేతన ఎగురవేస్తున్నారు, యావత్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు, అబ్బురపడేలా. ఔరా ఈ గ్రామం నుంచి ఇంతమంది ఐఏఎస్,.ఐపీఎస్ లు ఎంపికయ్యారా అంటూ ఆశ్చర్య చక్తులను చేస్తున్న ఆ గ్రామం వివరాలు ఇలా ఉన్నాయి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మాధోపట్టి గ్రామాన్ని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల గ్రామం అని పిలుస్తుంటారు.. రాజధాని లక్నో నగరం నుండి 250 K.M .దూరంలో ఉన్న ఈ గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి IAS లేదా IPS ఉంటారు. IAS, IPS మాత్రమే కాదు, ఈ గ్రామానికి చెందిన చాలా మంది తమ ప్రతిభతో ఇస్రో, మనీలా మరియు ఇంటర్నేషనల్ బ్యాంక్‌లలో మంచి పోస్ట్‌లో ఉన్నారు.
మొట్టమొదటి ఐఏఎస్ అధికారి ముస్తాఫ్ హుస్సేన్ !

ఈ గ్రామానికి చెందిన మొదటి IAS అధికారిగా, ముస్తఫా హుస్సేన్, .ఎంపికయ్యారు. ప్రముఖ కవి వామిక్ జాన్‌పురి తండ్రి. 1914లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ముస్తఫా హుస్సేన్ PCSలో చేరారు. హుస్సేన్ తర్వాత IAS ఇందు ప్రకాష్ 1951 లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో రెండవ ర్యాంక్ సాధించి IFS అధికారి అయ్యారు. దాదాపు 16 దేశాలకు ఆయన భారత రాయబారిగా కూడా ఉన్నారు. ఆయన సోదరుడు విద్యా ప్రకాష్ సింగ్ కూడా 1953లో ఐఏఎస్ అధికారిగా ఎన్నికయ్యారు.

అన్నదమ్ములు చరిత్ర సృష్టించారు !
మధోపట్టి గ్రామం పేరిట అపూర్వ రికార్డు నమోదైంది. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సోదరులు, ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. 1955లో, దేశంలోనే అత్యంత కష్టతరమైన ఈ పోటీ పరీక్షలో కుటుంబంలోని పెద్ద కొడుకు వినయ్ 13వ ర్యాంక్ సాధించాడు. బీహార్ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. అతని సోదరులు ఛత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్ ఇద్దరూ 1964లో ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. దీని తర్వాత అతని తమ్ముడు శశికాంత్ సింగ్ 1968లో UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించాడు.
కోచింగ్ సెంటర్ లేదు!

మధోపట్టిలో గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం ,కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు లేవు, గ్రామం 50 కిలోమీటర్ల దూరంలో కూడా లేవు గ్రామంలోని యువత తమ కృషి, అంకితభావంతో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు . ఇంటర్మీడియట్ లోనే విద్యార్థులు తరచూ ఐఏఎస్, పీసీఎస్ పరీక్షలకు గైడ్ పుస్తకాలతో హాజరవుతారని మాదోపట్టికి చెందిన ఉపాధ్యాయుడు వివరించారు. స్కూల్ నుండే ఐఏఎస్ కావడానికి ప్రిపేర్ అవుతారు. ఈ గ్రామం దేశంలోని ప్రతి యువకుడి కోసం, సౌకర్యాలు లేకపోయినా, కష్టపడి పనిచేస్తే, ఖచ్చితంగా విజయం సాధిస్తాం అనే సందేశాన్ని సమాజానికి ఇస్తున్నది.
బీహార్ రాష్ట్రం కూడా...

భారతదేశంలో బీహార్ రాష్ట్రం అత్యంత పేద రాష్ట్రాలలో ఒకటిగా, పరిగణించబడుతుంది. ఈ రాష్ట్రంలో నివసించే యువత చిత్తశుద్ధితో కష్టపడే తత్వానికి.మాత్రం తక్కువ కాదు .దేశంలోని ఐఏఎస్ క్యాడర్‌లో ప్రతి పదవ వంతు మంది బీహార్‌కు చెందినవారు కావడానికి ఇదే కారణం.
బీహార్‌లోని ఐఎఎస్‌లకు ప్రసిద్ధి చెందిన ఒక గ్రామం బీహార్‌లోని వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన శివహర్‌లోని కమ్రౌలీ గ్రామం. ఇది IAS గ్రామంగా పిలువబడుతుంది. ఈ గ్రామ జనాభా సుమారు 3200.

అయితే ఈ గ్రామంలో ఏడుగురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు. గ్రామంలోని ఏడుగురు వ్యక్తులు దీపక్ కుమార్, అపూర్వ వర్మ, లక్ష్మణేశ్వర్ ప్రసాద్, సియారామ్ ప్రసాద్ సిన్హా, అరుణ్ కుమార్ వర్మ, చంచల్ కుమార్ ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన రణధీర్ కుమార్ వర్మ ,ఇస్రోలో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్నారు. ఈ గ్రామంలో అక్షరాస్యత 90 శాతం.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కన్నా ఈ గ్రామాలు దేశానికి యువతకు ఆదర్శమే కదా మరి!