జగిత్యాల జిల్లా కేంద్రంలో..
జిల్లా అధ్యక్షుడు బాదినేని రాజేందర్!
(J. Surender Kumar)
జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సభ్యులు చైతన్య యాత్ర, ఆత్మీయ సమావేశం ఈ నెల 20న జగిత్యాల పట్టణంలో నిర్వహించనున్నట్లు బాదినేని రాజేందర్, బండారి రాజ్ కుమార్ ప్రకటనలో తెలిపారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో సమావేశం అందరం వరకు బైక్ ర్యాలీ , చైతన్య యాత్ర కార్యక్రమం జరుగుతుందని అధ్యక్షుడు రాజేందర్ ప్రకటనలో పేర్కొన్నారు. * భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్లో * జరగనున్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని మున్నూరు కాపు మున్సిపల్, మండల, గ్రామ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు,సభ్యులు, సమిష్టిగా విజయవంతం చేయాలని వారు ప్రకటనలో పేర్కొన్నారు.
ధర్మపురి లో బైక్ ర్యాలీ విజయవంతం చేయండి

!
ఈనెల 20న ధర్మపురి పట్టణంలోని పటేల్ గార్డెన్ నుంచి బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించబడుతుందని ధర్మపురి మండల పట్టణ అధ్యక్షులు సౌల భీమయ్య ,సంగీ రాజశేఖర్ ప్రకటనలలో పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలో జరగనున్న చైతన్య యాత్రకు తరలి వెళ్లే సభ్యులు పటేల్ గార్డెన్ నుంచి గాంధీ , నంది అంబేద్కర్ చౌరస్తా నుండి. బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించబడుతుందని ప్రకటనలో వివరించారు.