బుధవారం 7 న…
( J.Surender Kumar)
మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుండి హెలికాప్టర్ ద్వారా జగిత్యాల జిల్లాకు పయనం...

12 గంటల 30 నిమిషాలకు జగిత్యాల జిల్లా సమీకృత అధికారుల కార్యాలయంలోని హెలిప్యాడ్ కు చేరిక…
12 గంటల 40 నిమిషాలకు టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు…
ఒంటి గంటకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు...
1.15 నిమిషాలకు సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు…
అనంతరం జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశంలో పాల్గొన్న తర్వాత మధ్యహన భోజనం చేయనున్నారు…

3 గంటల 10 నిమిషాలకు జగిత్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు…
4 గంటల 15 నిమిషాలకు జగిత్యాల నుండి తిరిగి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు…
కరాటే పోటీల్లో సత్తా చాటిన జగిత్యాల విద్యార్థులు !
6 బంగారు, 3రజత, 5 కాంస్య పథకాలు !

హర్యానా గూర్గామ్ లోని, ఇన్ఫినిటీ బాడ్మింటన్ హాల్లో 1,2,3,4 తేదీలలో 4 రోజుల పాటు ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన, 26 వ జాతీయ స్థాయి కరాటే పోటీలలో 22 రాష్ట్రాలకు చెందిన ,1500 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలలో జగిత్యాల ఒకినావా మార్షల్ ఆర్ట్ అకాడమీ కి చెందిన 11 మంది క్రీడాకారులు పాల్గొని 14 పథకాలు సాధించారని జగిత్యాల జిల్లా స్పోర్ట్స్ కరాటే – డో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మర్రిపెల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఈ మేరకు కటా మరియు కుమితే ( ఫైట్ ) సబ్ – జూనియర్, జూనియర్, క్యాడేట్, సీనియర్స్ విభాగాల్లో పాల్గొన్న జగిత్యాల క్రీడాకారులు జి శృతి, ఎస్ చక్రి, వి ప్రేమ్ కుమార్, కె సాయి చరణ్, కె హర్షిత్ రెడ్డి లు బంగారు పథకాలు సాధించగా కె సాయి చరణ్ ,డి శ్రీజ,వి స్నేహర్షిత లు రజత పథకాలు జె సాయివిగ్నేష్,ఎస్ సృజన్, వి బాలాజీ, ఎస్ దేవర్షి లు కాంస్య పథకాలు సాధించినట్టు వివరించారు.
పథకాలు సాధించిన క్రీడాకారులను ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ ఎస్ శ్రీనివాసన్, తెలంగాణ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ కె వసంత్ కుమార్, చీఫ్ ఆఫీసియల్ కె మొండయ్య, జాతీయ స్థాయి కరాటే పోటీల ఆర్గనైజర్స్ ఆశీస్, దీపక్, కరాటే మాస్టర్ లు అనంతుల కాంతారావు,ఎం విక్రమ్,తిరుమల నరేష్,రాపర్తి రాము, ఆముద సంతోష్, తదితరులు అభినందించారు.
బిజెపి ఆధ్వర్యంలో నివాళులు !

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ధర్మపురి బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. . ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్, బిజెపి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కడారి గంగాధర్, బిజెపి జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, బిజెపి కిషన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు, బండారు లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి, ఆకుల శ్రీనివాస్, బిజెపి పట్టణ అధ్యక్షులు బెజ్జారపు పవన్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి కస్తూరి శరత్, తోట శ్రీనివాస్, సీనియర్ నాయకులు పల్లెర్ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.