జగిత్యాలలో కాపుల హక్కుల సాధన చైతన్య యాత్ర !

ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు

కొండ దేవయ్య!

(J. Surender Kumar)

జగిత్యాల నియోజవర్గ మున్నూరు కాపుల హక్కుల కోసం మంగళవారం చైతన్య యాత్ర స్థానిక భాగ్యరాజ్ ఫంక్షన్ హల్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభించి జగిత్యాల పట్టణ ప్రధాన కూడలి గుండా ర్యాలీ నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య జెండా అవిష్కరించారు.

రాష్ట్రంలో 24 శాతం జనాభా మనది!
కొండ దేవయ్య పటేల్

ఈ సందర్భంగా కాపు సంఘ ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు 70 శాతం మంది ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్నారని వ్యవసాయ రంగాన్నే నమ్ముకొని జీవిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 24% జనాభా ఉన్న ఏకైక కులం మున్నూరు కాపు కులం అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులలో దామాషా పద్ధతిలో మనకు పలు రాజకీయ పార్టీలు ఎన్నికలలో సీట్లు కేటాయించడం లేదన్నారు.

రాష్ట్రంలోని బీసీ వర్గాలకు అన్ని రకాల కార్పొరేషన్లు ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సహాయం చేస్తున్న మున్నూరు కాపు కార్పొరేషన్ కు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదన్నారు. మున్నూరు కాపులను ఏకతాటిపైకి తెచ్చి కుల బలాన్ని నిరూపించే విధంగా, కుల బంధావులలో చైతన్యం నింపేందుకే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.

అనంతరం హైదరాబాదులో మున్నూరు కాపు గర్జన నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకే కులం ఒకే సంఘం అనే నినాదంతో 33 జిల్లాల్లో అన్ని రకాల కమిటీలు వేయడం జరిగిందని తెలిపారు. చైతన్య యాత్ర ద్వారా కుల బాంధవులలో మరింత చైతన్యం తీసుకువచ్చేందుకు చైతన్య యాత్రను చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలోని 40 లక్షల కులబంధావులను ఏకం చేసేందుకే చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, దీనితో ప్రభుత్వలు మున్నూరు కాపుల జనాభాను గుర్తించి రానున్న ఎన్నికల్లో మన మున్నూరు కాపు దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు చేపట్టి చేపట్టాలని, మున్నూరు కాపు కార్పొరేషన్ కు నిధులు సమకూర్చాలని డిమాండ్తో చైతన్య యాత్ర చేపడుతున్నామన్నారు.


ఈకార్యక్రమంలో బాదినేని రాజేందర్ , బండారి రాజ్ కుమార్, దీటి అంజయ్య పటేల్ కౌన్సిలర్ లు తోట మల్లికార్జున్ , పిట్ట ధర్మరాజు, చుక్క నవీన్, కొలగాని సత్తన్న , కూతురి శేకర్ , తీగల శ్రీనివాస్ , రంగు గోపాల్ , వంగల రమేష్ , మునిసిపట్ల లక్ష్మి నారాయణ, గోపి రాజిరెడ్డి , పడాల తిరుపతి , గురునాథం మల్లారెడ్డి అన్ని గ్రామాల అధ్యక్షులు మరియు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.