జగిత్యాలలో ప్రజాసంగ్రామ యాత్ర
విజయవంతం చేద్దాం !

బిజెపి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రావు

(J.Surender Kumar)

బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను జగిత్యాల లో విజయవంతం చేద్దామని ఆ దిశగా ప్రతి కార్యకర్త కృషి ఉండాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు పిలుపునిచ్చారు, బిజెపి రూరల్ మండల కార్యవర్గ సమావేశం మండల అద్యక్షులు నలువాల తిరుపతి అధ్యక్షతన స్థానిక ఫంక్షన్ హాలులో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసు కోవడానికి, బిజెపి పార్టీని గడప గడపకు పరిచయం చేయడమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర ఉంటుందన్నారు. ఈ పాదయాత్రను జగిత్యాల పరిధిలో విజయవంతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సిద్ధంగా ఉండాలని కోరారు. సత్వరమే పార్టీ బూత్ స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలని, ప్రతి బూత్ నుంచి వంద మంది ప్రజలను ప్రజా సంగ్రామ యాత్రలో భాగస్వాములను చేయాలని సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చిలుక మర్రి మదన్ మోహన్ , పన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా కార్యదర్శి పెద్ద గంగారాం, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇట్నేని రమేష్ , మండల ప్రధాన కార్యదర్శి పొట్టవత్తిని భరత్, గొస్కుల గంగాధర్, ఎంపిటిసి పూదరి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.