ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!.
(J. Surender Kumar)
జగిత్యాల జిల్లా కేంద్రంలో, జర్నలిస్టులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ల కోసం. వెల్ నెస్ సంతను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం హైదరాబాదులో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కలిసి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వైద్య కళాశాల జిల్లా కేంద్రంలో ఉంది కనుక వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు పెద్ద సమస్య కాదని ,త్వరలో ఆదేశాలు జారీ చేస్తానని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.
చెరువులు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి!

జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఇటీవల భారీ వరదలకు దెబ్బతిన్న చెరువులు ధర్మ సముద్రం కట్ట, పెద్ద చెరువు, అరగుండాలు తదితర చెరువులను పునరుద్ధరించడం కోసం నిదులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. మంగళవారం హైదరాబాదులో ఆపరేషన్స్ అండ్ మెయింటైన్నేన్స్ కార్యాలయానికి వెళ్లి ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) నాగేందర్ ను వినతి పత్రం తోపాటు పరిస్థితులు వివరించారు. స్పందించిన అధికారి త్వరలో నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే కు హామీ ఇచ్చారు.
డిపిఓ. కార్యాలయం పనులు పూర్తి చేయండి !

జగిత్యాల జిల్లా కేంద్రం లో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ( DPO ) ను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ హైదరాబాదులో హోం మంత్రి మహమ్మద్ అని కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సంబంధిత అధికారులను నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.