ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీ..
(J. Surender Kumar)
సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా పట్ల ఎందుకు సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారు అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గురువారం జగిత్యాల ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సమావేశంలో జీవన్ రెడ్డి ప్రభుత్వం పై చేసిన విమర్శలు ఆయన మాటల్లో…..
జగిత్యాల లో సీఎం కెసిఆర్ సభ తో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ప్రోత్సాహాకం లభిస్తుందని రైతులు ఆశ పడిన నిరాశే మిగిలింది..
వరికి ప్రత్యామ్నయంగా చక్కర ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే
టిడిపి పాలనలో 51 శాతం అమ్మేశారు.
రాజకీయాలకు అతీతంగా
చక్కర ఫ్యాక్టరీని ప్రభుత్వపరంగా చేపట్టాలని ఉద్యమించారు..
తెలంగాణ వచ్చిన తర్వాత
ప్రభుత్వం చక్కర ఫ్యాక్టరీని నిర్వహిస్తుందని ఆశిస్తే
పూర్తిగా మూసివేశారు..
చెరకు పంట మొదటి సంవత్సరం పెట్టుబడి అవసరం ఉంటుంది..రెండో సంవత్సరం నుండి కూలీల భారం తగ్గుతుంది..
స్థానికంగా చక్కర ఫ్యాక్టరీ లేకపోవడం తో 100 కెలోమీటర్ల దూరంలోని గాయత్రి చక్కర ఫ్యాక్టరీ కి తరలించాల్సిన దుస్థితి నెలకొంది. మూడు జిల్లాల రైతాంగం లబ్ది పొందే
చక్కర ఫ్యాక్టరీలు రు.1000 కోట్ల పెట్టుబడితో పునః ప్రారంభం చేయవచ్చు..చక్కర కర్మాగారం నిర్వహణకు
జగిత్యాల జిల్లాలో ప్యాక్స్ తో సమాఖ్య ఏర్పాటు చేసి నిర్వహణ చేపట్టాలి.
కేంద్ర ప్రభుత్వ నుండి కూడా సహకారం పొందే అవకాశం ఉన్నా సీఎం కెసిఆర్ పట్టించు కోవడం లేదు..
సీఎం కెసిఆర్ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటున్నారని విమర్శించారు.
సీఎం కు ఎందుకీ మొండి పట్టుదల..
స్థానిక సమస్యల్ని ప్రజా ప్రతినిధులు రైతుల సమస్యలను సీఎంకు నివేదించక పోవడం
స్థానిక టిఆర్ఎస్ నాయకుల వైఫల్యం అని ద్వజమెత్తారు.
మోతే చెరువు కట్ట రెండు సార్లు తెగిపోయింది.. రో ల్ల వాగు తెగిపోయింది.. స్థానిక సమస్య పరిష్కారానికి ఎందుకు చొరవ చూపడం లేదు..
ఒడ్డెలింగపుర్ ను మండలంగా చేస్తామని సీఎం
నిజామాబాద్ లో సీఎం ప్రకటించారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
మండలంగా ఏర్పాటు కోసం అన్ని అర్హతలు ఉన్నాయి. వెంటనే ఒడ్డే లింగాపూర్, ఆల్లిపుర్ ను మండలాలుగా ప్రకటించాలి..
రోల్లవాగు నిర్మాణంలో జాప్యంతో
రు.60 కోట్ల ప్రాజెక్ట్ వ్యయం 120 కోట్లకు పెరిగింది..
కట్ట తెగి అరగుండాల ప్రాజెక్ట్ తెగిపోయి పొలాల్లో ఇసుక మేటలు వేసింది.
రైతులు వర్షాకాలం పంట కోల్పోయారు.
రెండో పంట కూడా కోల్పోతున్నారు.
మత్స్య సంపద కొట్టుకు పోయింది.
మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు.
రొల్ల వాగు ప్రాజెక్ట్ జాప్యం పై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి ..
రాష్ట్రంలో జిల్లాగా ఏర్పాటులో అర్హత ఉన్నవాటిలో జగిత్యాలది రెండో స్థానం..
ములుగు, భూపాల్ పల్లి, సిరి సిల్ల, పెద్దపల్లి జిల్లాలుగా ఏర్పాటు చేయవచ్చు కానీ జగిత్యాల జిల్లా గా ఏర్పాటు చేయరాదా అని సీఎం ను నిలదీశారు.
జగిత్యాల జిల్లాగా మారుతుందని అనుకోలేదని సీఎం అనడం పై జీవన్ రెడ్డీ ఎద్దేవా చేశారు ..
భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వ భూమిని రక్షించానని
జగిత్యాల నడిబోడ్డున కలెక్టరేట్ కార్యాలయం నిర్మించడం..
40 ఏళ్ల నా ప్రజా జీవితంలో ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పాత్రికేయులకు ఇళ్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత ..
టిఆర్ఎస్ పార్టీ భవనం 5 నెలల్లో పూర్తి చేశారు..
నిరుపేదల డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం 5 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు..ఎందుకీ నీర్లక్యం..
2015 లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సీఎం కెసిఆర్ రు.100 కోట్లు ఇస్తా అని నిధులు విడుదల చేయలేదు..
తిరుపతికి ప్రత్యామ్నయంగా ఆధ్యాత్మికంగా, టూరిజం గా యాదాద్రి నిర్మించారు సంతోషం
తెలంగాణ భాషను ఎందుకు మార్చుతున్నారు.
యాదగిరి గుట్టను యాదాద్రి గా ఎందుకు మార్చారు..
ప్రతి గ్రామ పంచాయతీలకు 10 లక్షలు ఇస్త అన్నారు. వెంటనే నిధులు మంజూరు చేయాలి .
సర్పంచులు ట్రాక్టర్ వాయిదాలు కట్టలేకపోతున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టణ అభివృద్దికి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి..
జగిత్యాల కు ప్రత్యేకంగా రు.100 కోట్లు నిధులు విడుదల చేయాలి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీ డిమాండ్ చేశారు.